Keerthy Chawla: పెళ్లి తర్వాత ఆ పనికి భయపడి పెళ్లికి దూరంగా ఉన్న ఎన్టీఆర్ హీరోయిన్..?
Keerthy Chawla: సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీలో ఫెయిడ్ అవుట్ అయిపోయాక పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అవుతారు.ఆ తర్వాత పిల్లలు పుట్టాక మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారు.కానీ ఎన్టీఆర్ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ మాత్రం పెళ్లి తర్వాత చేసే ఆ పనికి భయపడి పూర్తిగా పెళ్లికి దూరమైందట.. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే కీర్తి చావ్లా..జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది మూవీలో కీర్తి చావ్లా ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించింది.
NTR heroine Keerthy Chawla who avoided marriage because
అయితే ఈ సినిమా తర్వాత కీర్తి చావ్లాకు కొన్ని అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా తనకు వచ్చిన ఎన్నో అవకాశాలను తానే స్వయంగా చెడగొట్టుకుందట. ఎందుకంటే ఒక సినిమా హిట్ అవ్వడంతో తనకు వచ్చే సినిమాల్లో రెమ్యూనరేషన్ ఎక్కువ కావాలంటూ డిమాండ్ చేయడంతో ఈ హీరోయిన్ ని పక్కన పెట్టి వేరే హీరోయిన్స్ ని తీసుకున్నారట. అలా సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి దూరమైపోయింది.(Keerthy Chawla)
Also Read: Samantha: సవాళ్లతో కూడిన పాత్రలు..సమంత కీలక వ్యాఖ్యలు!!
ఇక సినిమాల్లో అవకాశాలు తగ్గాక పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో సెట్ అవుతుంది అని అందరూ అనుకుంటారు. కానీ అలా జరగలేదు.. ఎందుకంటే ఈ హీరోయిన్ పెళ్లి తర్వాత జరిగే పనికి బయపడి పెళ్లికి దూరమైందట. ఇంతకీ ఆ పని ఏంటయ్యా అంటే..పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే పిల్లల్ని కనాల్సి ఉంటుంది. అలా ప్రెగ్నెన్సీ వచ్చాక హాస్పిటల్ కి వెళ్లాల్సి వస్తుంది.అయితే చిన్నప్పటి నుండి కీర్తికి హాస్పిటల్ అంటే చాలా భయమట.
అందుకే ఎక్కడ హాస్పిటల్ కి వెళ్లాల్సి వస్తుందో అనే భయంతో ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోవడం లేదు అని తెలుస్తుంది. అయితే ఈమెకు ఉన్న ఈ వింత భయం చూసి చాలా మంది నెటిజన్లు షాక్ అవుతున్నారు.మరి కొంతమంది ఏమో అంత ట్రాష్ అని కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే చిన్నప్పటినుండి హాస్పిటల్ కి వెళ్లకుండా ఎవరు పెరగరు. అలాంటిది హాస్పిటల్ కి వెళ్లాల్సిన వస్తుంది అనే భయంతో పెళ్లి చేసుకోకుండా ఉంటారా అని కామెంట్స్ పెడుతున్నారు.(Keerthy Chawla)