Malavika Mohanan: తొలి సినిమా విడుదల కాకముందే అందాలతో కాకపుట్టిస్తున్న మాళవిక!!

Malavika Mohanan social media popularity

Malavika Mohanan: అతి తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో పాపులర్ హీరోయిన్‌గా ఎదిగిన మాళవిక మోహనన్, 2013లో ‘పట్టం పోలే’ మలయాళ చిత్రం ద్వారా సినీ రంగంలో అడుగుపెట్టారు. ఈ చిత్రంతోనే ఆమె మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.

Malavika Mohanan social media popularity

తర్వాత, కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన ‘పేట’ చిత్రంలో నటించి, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చిన మాళవిక, ధనుష్, విజయ్ దళపతి వంటి స్టార్ హీరోలతో నటించి తన కెరీర్‌ను మరింత ముందుకు తీసుకెళ్లారు.

ఇప్పుడు తెలుగులో అడుగు పెట్టిన మాళవిక, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్‌లోను స్టార్ హీరోయిన్‌గా ఎదగడం ఖాయమని భావిస్తున్నారు. ఆమె నటిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం

మాళవిక మోహనన్, చివరగా ‘తంగళాన్’ చిత్రంలో చియాన్ విక్రమ్‌తో కలిసి నటించారు, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. అలాగే, సిద్ధాంత్ చతుర్వేది సరసన హిందీ చిత్రంలో ‘యుద్ర’లో కూడా నటించారు. ఆమె తరచూ సోషల్ మీడియాలో అందమైన ఫోటోలు పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటారు. సోషల్ మీడియా లో ఆమె అందాలతో చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *