Sivakarthikeyan Parashakthi: ఆసక్తికరంగా శివకార్తికేయన్ ‘పరాశక్తి’ టీజర్.. సుధా కొంగర అదిరిపోయే పీరియాడిక్ డ్రామా!!
Sivakarthikeyan Parashakthi: తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం “అమరన్” బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు, శివకార్తికేయన్ తన తదుపరి చిత్రం ప్రముఖ దర్శకురాలు సుధా కొంగరతో చేస్తున్నారు. ఈ చిత్రం పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతుండటం విశేషం.
Sivakarthikeyan Parashakthi Periodic Film
ఈ చిత్రంలో శివకార్తికేయన్‌తో పాటు జయం రవి, అథర్వ, శ్రీలీల వంటి స్టార్ నటీనటులు కూడా నటిస్తున్నారు. పీరియాడిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది.
విడుదలైన టీజర్ పవర్‌ఫుల్‌గా ఉండటమే కాకుండా, నటీనటుల లుక్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా శివకార్తికేయన్, జయం రవి, అథర్వ, శ్రీలీల పాత్రలు ప్రత్యేకంగా నిలిచాయి. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ టీజర్‌కు మరింత వన్నె తెచ్చాయి.
శివకార్తికేయన్ అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుధా కొంగర దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామా రావడం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కానుండగా, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.