Allu Sirish: అల్లుఅరవింద్ గారి చిన్న కొడుకు అల్లు శిరీష్ అంటే అందరికీ తెలుసు.. ఈయన టాలీవుడ్లోకి గౌరవం అనే మూవీతో ఎంట్రీ ఇచ్చారు. కానీ మొదటి సినిమా అనుకున్నంత హిట్ అవ్వలేదు. అయితే స్టార్ నిర్మాత కావడంతో ఆయన చిన్న కొడుకు పై చాలామంది హోప్స్ పెట్టుకున్నారు. కానీ అల్లు అర్జున్ అయినంత పాపులర్ అల్లు శిరీష్ అవడం లేదు. ఒకరకంగా ఈయన్ని అల్లు అరవింద్ పట్టించుకోవడం లేదనే టాక్ కూడా టాలీవుడ్ లో ఉంది.
Allu Sirish who defamed his father in front of everyone
ఇదిలా ఉంటే తాజాగా అల్లు శిరీష్ చేసిన బడ్డీ మూవీకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్గా నిర్వహించారు మూవీ యూనిట్. ఇక ఈ ఈవెంట్లో అల్లు శిరీష్ తో పాటు నిర్మాత, డైరెక్టర్,హీరోయిన్స్ అందరూ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.అయితే గత సంవత్సరం అనౌన్స్ చేసిన బడ్డీ మూవీ గురించి మళ్ళీ ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో ఈ మూవీ చేయడం లేదనే టాక్ కూడా వినిపించింది. కానీ ఎట్టకేలకు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి ఆ పుకార్లకు చెక్ పెట్టారు. (Allu Sirish )
Also Read: Vijay: ఆ హీరోయిన్ తో మళ్లీ ప్రేమాయణం నడుపుతున్న విజయ్.. భార్యతో ఇబ్బందులు తప్పవా.?
అయితే బడ్డీ మూవీ తమిళ హీరో ఆర్య నటించిన టెడ్డి మూవీ లాగే ఉండడంతో చాలామంది రీమేక్ అని భావించారు. కానీ ట్రైలర్ చూస్తే రిమేక్ కాదని అందరికీ అర్థం అవుతుంది. అయితే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో అల్లు అరవింద్ ని కించపరిచినట్టు మాట్లాడారు అల్లు శిరీష్. మరి ఇంతకీ ఆయన ఏం మాట్లాడారంటే.. ఈ సినిమా గురించి చాలామంది చాలా రకాల ట్రోల్స్ చేశారు. కానీ నేను వాటిని పట్టించుకొని కూర్చోలేదు.అయితే ఈ సినిమా కాపీ అని చెప్పారు.ఇక దీని గురించి నేను ఎంత చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోరు.
అందుకే చెప్పడం కూడా మానేశాను. ఇక ఈ సినిమా ట్రైలర్ చూసి నాకు మూవీ పై ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అలాగే ఈ మూవీకి నిర్మాతలు జ్ఞానవేల్ పెట్టినన్ని డబ్బులు మా నాన్న కూడా ఇప్పటివరకు నాపై ఖర్చు పెట్టలేదు.. అంటూ మాట్లాడడంతో ప్రస్తుతం శిరీష్ మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.ఇక అంత పెద్ద ఈవెంట్లో తండ్రి గురించి కించపరిచినట్టు మాట్లాడి అల్లు అరవింద్ ని అల్లు శిరీష్ ఘోరంగా అవమానించారంటూ సోషల్ మీడియాలో ఈయనపై ట్రోల్స్ చేస్తున్నారు.(Allu Sirish )