Anil Ravipudi: మెగాస్టార్ సినిమా కోసం అనిల్ రావిపూడి రావిపూడి రెమ్యునరేషన్ ..?

Anil Ravipudi Demands 25 Crores

Anil Ravipudi: టాలీవుడ్‌లో హిట్ మెషీన్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ రూ.300 కోట్ల వసూళ్లు సాధించే దిశగా దూసుకుపోతున్నాడు. ఈ సినిమా అందుకున్న భారీ విజయం తర్వాత, ఇప్పుడు అందరి చూపులు అనిల్ రావిపూడి చేయబోయే మెగాస్టార్ సినిమాపై ఉన్నాయి.

Anil Ravipudi Demands 25 Crores for Chiranjeevi Movie

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన యంగ్ డైరెక్టర్స్ బాబీ, అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాలు చేయనున్నారు. అయితే, అనిల్ రావిపూడి వెంకటేష్ లాంటి సీనియర్ హీరోకి ఇంతటి భారీ విజయాన్ని అందించడంతో, మెగాస్టార్ కోసం కూడా అలాంటి కథను సిద్ధం చేసి ఖచ్చితంగా హిట్ చేయగలడని అభిమానులు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి తనకున్న డిమాండ్ మేరకు రెమ్యునరేషన్ కూడా పెంచినట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవితో సినిమాకు అనిల్ రావిపూడి తన రెమ్యునరేషన్‌గా రూ.25 కోట్లు డిమాండ్ చేస్తున్నారని సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక మెగాస్టార్‌తో అనిల్ రావిపూడి మూవీ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *