Devara: విడుదలకు ముందే రికార్డులు సృష్టించిన ఎన్టీఆర్ నటించిన “దేవర” సినిమా, మంచి వసూళ్లు కూడా రాబడుతోంది. ఓవర్సీస్ ప్రీ సేల్స్ బాక్సాఫీస్‌లో అత్యంత వేగంగా ఒక మిలియన్ యూఎస్ డాలర్ల మార్క్ దాటి, రికార్డు సృష్టించిన ఈ చిత్రం, తాజాగా 2 మిలియన్ మార్క్‌ను కూడా అధిగమించింది. ఈ విషయాన్ని తెలియజేయడానికి చిత్ర యూనిట్ ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. లాంచ్‌కు ఇంకా మూడు రోజుల సమయం ఉండగా, అప్పటివరకు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

Devara Massive Box Office Collections Before Release

కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుండగా, స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఇంతలో, ఎన్టీఆర్ తండ్రీకొడుకులుగా నటిస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

Also Read: Karthi: కార్తీకి తెలుగు లో బంపర్ ఆఫర్.. ఆ యూనివర్స్ లో హీరో?

దీనితో పాటు, ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని, ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం మాత్రమే చేస్తున్నాడని చిత్ర సినిమాటోగ్రాఫర్ స్పష్టం చేశారు. కానీ తండ్రీ కొడుకుల విషయమై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.