Balakrishna: బాలయ్యకు పద్మభూషణ్ వచ్చింది ఆ ఉంగరం వల్లేనా..
Balakrishna: బాలకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏదైనా శాసించగల సత్తా ఉన్న హీరో.. కానీ ఆయన అలాంటివేవీ పట్టించుకోకుండా కేవలం నటన టాలెంట్ ను నమ్ముకొని హీరోగా ఎదిగారు.. తన తండ్రి ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అలాంటి బాలకృష్ణ కెరియర్ ప్రస్తుతం చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు.. ఆయన ఏది ముట్టుకున్న బంగారమే అవుతుంది.. కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా తిరుగులేకుండా దూసుకుపోతున్నారు.
Balakrishna got Padma Bhushan because of that ring
వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు క్రియేట్ చేశారు.. ఇలా సినిమాలు, రాజకీయాలు, పలు టీవీ షోలలో కూడా బాలకృష్ణ సక్సెస్ఫుల్ గా దూసుకుపోవడంతో ఆయన విజయ సోపానానికి కారణమేంటని వెతికే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది నెటిజన్స్. ఈ తరుణంలోనే ఒక వార్త నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుంది.. బాలకృష్ణ అంతటి విజయాలు సాధించడానికి కారణం ఆ ఉంగరమే అని నెట్టింటా చర్చ జరుగుతోంది.. (Balakrishna)
Also Read: Hina Khan Emotional Post: క్యాన్సర్ వచ్చిన స్టార్ హీరోయిన్ కు సేవలు చేస్తున్న భర్త!!
సెంటిమెంటును ఎంతో నమ్మే బాలకృష్ణ ఏ పని చేసిన మంచి సమయం చూసుకొని మొదలు పెడుతూ ఉంటారు.. అందుకే ఆయన సక్సెస్ అవుతారని, అంతేకాకుండా అన్ని రంగాల్లో విజయం సాధించడం కోసం ఆయన ఈ కుడి చేతి బొటనవేలికి పచ్చ రంగు ఉంగరం ధరించారని దీనివల్లే తన కెరియర్ అద్భుతంగా దూసుకుపోతుందని అంటున్నారు.. అంతేకాదు ఈ ఉంగరం ధరించిన తర్వాతే ఆయనకు పద్మభూషణ్ అవార్డు కూడా దక్కిందని తెలియజేస్తున్నారు..
ఇక ఇదంతా పక్కన పెడితే బాలకృష్ణ అభిమానులు ఏమో ఇది మా హీరో టాలెంట్ కు వచ్చినటువంటి అవార్డు.. దాన్ని ఉంగరం ఖాతాలో వేయడం సమంజసం కాదు.. ఆయన గత కొన్ని ఏళ్ల నుంచి రాజకీయంగా, సినిమా పరంగా ఇతర విషయాల్లో ఎన్నో సేవలు చేస్తూ పేద ప్రజలకు అండగా ఉంటున్నారు. అంతటి సేవలు చేసే మా హీరోను గుర్తించి కేంద్ర ప్రభుత్వం అవార్డు అందించిందని దాన్ని ఉంగరం ఖాతాలో వేయడం మంచిది కాదని కామెంట్లు పెడుతున్నారు.(Balakrishna)