Movie Budgets: నిర్మాతల కొత్త ఫార్ములా.. లాభాల కోసం సరికొత్త ఫ్లానింగ్!

sankranthi movies 2025 How Big Banners Balance Movie Budgets

Movie Budgets: టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాణ సంస్థలు ఇప్పుడు బ్లాక్‌బస్టర్ హిట్‌లతో పాటు మీడియం-రేంజ్ సినిమాలకూ ప్రాధాన్యత ఇస్తున్నాయి. పెద్ద బ్యానర్లు బడ్జెట్‌ను స్మార్ట్‌గా బ్యాలెన్స్ చేస్తూ, సేఫ్ గేమ్ ప్లాన్ పాటిస్తున్నాయి. ఉదాహరణకు, దిల్ రాజు సంక్రాంతికి “వారసుడు” (Varisu) విడుదల చేయడంతో పాటు, “గేమ్ ఛేంజర్” (Game Changer) లాంటి భారీ సినిమాను ప్లాన్ చేసి విజయాన్ని అందుకున్నారు. ఇది ఆయన వ్యూహాత్మక నిర్ణయంగా చెప్పుకోవచ్చు.

How Big Banners Balance Movie Budgets

నాగ వంశీ సైతం “సార్”, “లక్కీ భాస్కర్” లాంటి మధ్యస్థ హీరోల సినిమాలతో భారీ విజయాలు సాధించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) దుల్కర్ సల్మాన్, ధనుష్ లాంటి హీరోలతో మధ్యస్థ బడ్జెట్ సినిమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తోంది. రాబోయే ప్రాజెక్టులలో విజయ్ దేవరకొండ “VD12”, రవితేజ “మాస్ జాతర” (Mass Jathara) ప్రధానమైనవి.

భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అయిన గీతా ఆర్ట్స్ (Geetha Arts) నాగ చైతన్య, చందూ మొండేటి కాంబినేషన్‌లో “తండేల్” (Tandel) కోసం 80 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నితిన్‌తో “రాబిన్ హుడ్”, యూవీ క్రియేషన్స్ (UV Creations) వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో మధ్యస్థ బడ్జెట్ సినిమాను ప్లాన్ చేస్తోంది.

మొత్తానికి, పెద్ద బ్యానర్లు భారీ, మీడియం సినిమాలను సమతుల్యం చేస్తూ సినీ పరిశ్రమ ఎదుగుదలకు సహాయపడుతున్నాయి. ఈ వ్యూహం టాలీవుడ్‌లో స్థిరమైన అభివృద్ధికి కీలకంగా మారనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *