Pushpa 2 Netflix: ఇక నుంచి ‘పుష్ప’ గాడి మాస్ రూల్..నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్!!
Pushpa 2 Netflix: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం “పుష్ప 2: ది రూల్”, టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రం గతేడాది విడుదలై ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసి, ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇప్పుడు, థియేటర్లలో విజయం సాధించిన ఈ సినిమా ఓటీటీలోనూ సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమైంది.
Pushpa 2 Netflix Streaming Starts Today
ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ Netflix ఈ సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుని, ఇవాళ నుంచి స్ట్రీమింగ్ ప్రారంభించింది. “పుష్ప 2 రూల్” పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా, బన్నీ ఫ్యాన్స్‌కు పండగలా మారింది. ఈ సందర్భంగా Netflix India తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. అంతేకాదు, ఇన్స్టాగ్రామ్ బయోగ్రఫీలో “ఇప్పటి నుంచి పుష్ప గాడి రూల్” అని పేర్కొనడం విశేషం. ఈ క్రేజీ అప్డేట్ చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
అల్లు అర్జున్‌కు ఉన్న మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. “పుష్ప” ఫ్రాంచైజీతో ఆయన క్రేజ్ దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగింది. ఇప్పుడు Netflix కూడా బన్నీ మేనియాకి ఫిదా అవడం చూస్తుంటే, ఆయన పాపులారిటీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. థియేటర్లలో రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా ఓటీటీలోనూ కొత్త రికార్డులు సెట్ చేస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. ఈ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ చూడాలని అనుకునే వాళ్లు ఇప్పుడే Netflix లో స్ట్రీమింగ్ ప్రారంభించండి.