Chiranjeevi Next Movie: చిరు కోసం అనిరుధ్ రవిచందర్.. రక్త పాతం కావాల్రా మీకు???
Chiranjeevi Next Movie: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న భారీ విజువల్ స్పెక్టాకిల్ ‘విశ్వంభర’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్స్ అనీల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెల లతో చిరు సినిమాలు ప్లాన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కనున్నట్లు సమాచారం.
Chiranjeevi Next Movie with Anirudh Music
ఈ ప్రాజెక్ట్‌కు సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. అనిరుధ్ ఇప్పటికే జైలర్, లియో, విక్రమ్ వంటి బ్లాక్‌బస్టర్ ఆల్బమ్‌లతో మ్యూజిక్ ఇండస్ట్రీని శాసిస్తున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ ప్రాజెక్ట్‌కు వర్క్ చేయడానికి అనిరుధ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అనిరుధ్ స్టైల్ మ్యూజిక్ చిరంజీవి మాస్ ఇమేజ్‌కు సరిపోతుందా? అనే ప్రశ్న అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ‘జైలర్’ కోసం అందించిన మాస్ బీజీఎం లాంటి ట్రాక్‌లు మెగాస్టార్ సినిమాలోనూ ఉంటాయా? అన్నది చూడాలి. టాలీవుడ్ లో అనిరుధ్ క్రేజ్ పెరుగుతోన్న ఈ సమయంలో సీనియర్ హీరోల సినిమాలకు కూడా భారీ స్థాయిలో మ్యూజిక్ అందించనున్నట్లు తెలుస్తోంది.
ఈ యాక్షన్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఇప్పటికే ‘విశ్వంభర’ పై భారీ అంచనాలు ఉన్నాయి. అదే స్థాయిలో శ్రీకాంత్ ఓదెలతో అనిరుధ్ మ్యూజిక్ కాంబినేషన్ సినిమాపై మరింత హైప్ తెచ్చేలా ఉంటుందా? చూడాలి!