Daaku Maharaj BGM: “డాకు” మాస్ స్కోర్ .. సోషల్ మీడియాని రూల్ చేస్తున్న చేస్తున్న థమన్

Daaku Maharaj BGM: సంక్రాంతి పండుగకు విడుదలైన నందమూరి బాలకృష్ణ మాస్ ఎంటర్‌టైనర్ ‘డాకు మహారాజ్’ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన అందుకుంది. దర్శకుడు బాబీ కోలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్‌గా నటించిన ఈ చిత్రంలో థమన్ బీజీఎం (Background Score) సినిమాకు హైలైట్‌గా నిలిచింది. బాలయ్య సినిమాల్లో ఆయన మ్యూజిక్ ఓ ప్రత్యేకతగా నిలుస్తుందని ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఈసారి కూడా థమన్ బాలయ్యకోసమే డెడికేటెడ్ గా స్కోర్ కంపోజ్ చేసి మాస్ ఆడియెన్స్‌ను ఫిదా చేశాడు.

Daaku Maharaj BGM Trending on Social Media

ఇటీవల, సోషల్ మీడియాలో సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్లు వైరల్ కావడం కామన్‌గా మారిపోయింది. ఎక్కువగా అనిరుధ్ రవి చంద్రన్ మ్యూజిక్‌ను రీమిక్స్ చేసి వివిధ భాషల్లో ఎడిట్స్ చేస్తున్న ట్రెండ్ కనిపించేది. అయితే, ఈసారి థమన్ డామినేట్ చేస్తూ ‘డాకు మహారాజ్’ లో ఇచ్చిన ‘సైతాన్’ బీట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ప్రత్యేకించి TikTok, Instagram Reels లాంటి ప్లాట్‌ఫామ్‌లలో ఈ బీట్ విపరీతంగా ట్రెండింగ్‌లో ఉంది.

తెలుగు మాత్రమే కాకుండా తమిళం, హిందీ వంటి భాషల్లోనూ ఈ మాస్ బీట్ ప్రాచుర్యం పొందుతోంది. థమన్ తన మ్యూజిక్‌తో మరోసారి సూపర్ హిట్ ఆల్బమ్ అందించాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. బాలయ్య ఎనర్జీకి తగ్గట్టు ఇంటెన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించడంలో థమన్ మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నాడు.

ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించగా, బాబీ డియోల్ విలన్ రోల్‌లో భయపెట్టాడు. థమన్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ చిత్రం, బాలయ్య అభిమానులకు ఓ రేంజ్ మాస్ ట్రీట్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *