Jani Master Viral Post: జానీ మాస్టర్ తాజా పోస్ట్ నెట్టింట వైరల్.. మీ నిజ స్వరూపం బయటపెడతా?
Jani Master Viral Post: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన తాజా సోషల్ మీడియా పోస్ట్‌తో నెట్టింట హాట్ టాపిక్‌గా మారాడు. ఇటీవల జరిగిన యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్, కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన పోస్ట్‌లో “స్వప్రయోజనాల కోసం కోర్టు తీర్పులను తప్పుగా చూపించేవారు ఉన్నారు” అంటూ స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చిన జానీ మాస్టర్, తన అనుమతి లేకుండా జరిగిన ఎన్నికలు, తాను వేసిన కేసుపై కోర్టు తీర్పును వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అని ఆరోపించాడు.
Choreographer Jani Master Viral Post
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, కానీ అసలు నిజాలు బయటకొచ్చే రోజు దగ్గర్లోనే ఉందని స్పష్టం చేశాడు. “నిజం ఎప్పటికీ న్యాయం సాధించక మానదు. ప్రజలను తప్పుదోవ పట్టించడం తాత్కాలికం మాత్రమే. అసలు తీర్పు వివరాలు బయటకు వచ్చిన రోజు, ఎవరి అసలైన ఉద్దేశం ఏంటో స్పష్టంగా తెలిసిపోతుంది” అంటూ ఆయన తాను ధైర్యంగా నిలబడతానని పేర్కొన్నాడు.
ఈ పోస్ట్‌పై ఆయన అభిమానులు, ఇండస్ట్రీ వ్యక్తుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. జానీ మాస్టర్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు, కోర్టు తీర్పు అసలు వివరాలు ఎప్పుడు బయటకు వస్తాయనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.