Mohammad Siraj: క్రికెటర్ సిరాజ్ తో డేటింగ్ రూమర్స్‌పై మహిరా శర్మ తల్లి!!
Mohammad Siraj: ప్రస్తుతం సోషల్ మీడియాలో హిందీ బిగ్‌బాస్ ఫేమ్ మహిరా శర్మ, భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌తో డేటింగ్ చేస్తున్నట్లు ఊహాగానాలు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ విషయం ప్రస్తుతం విస్తృతంగా చర్చనీయాంశమైంది. మహిరా శర్మ చేసిన ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు సిరాజ్ లైక్ చేయడం, అలాగే ఆమెను ఫాలో అవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.
Mahira Sharma denies dating Mohammad Siraj
ఈ నేపథ్యంలో, సిరాజ్, మహిరా శర్మ మధ్య సంబంధం ఉన్నదని వార్తలు వస్తున్నాయి. ఫేమస్ అయిన చాలామంది మీద ఇలాంటి వార్తలు రావడం సహజమే. అందులోనూ క్రికెటర్ కాబట్టి ఇలాంటివి ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఈ వార్తలపై మహిరా శర్మ తల్లి సానియా శర్మ స్పందించారు. ఆమె మాట్లాడుతూ, “ఇలాంటి నిరాధారమైన ఊహాగానాలను నమ్మకండి” అని విజ్ఞప్తి చేశారు. ఒక ఇంటర్వ్యూలో భాగంగా విలేకరులు ఈ అంశంపై ప్రశ్నించగా, ఆమె స్పందించారు,
మీరు ఏమి మాట్లాడుతున్నారు? బయటి వ్యక్తులు అనేక విషయాలు చెబుతుంటారు. నా కుమార్తె ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయింది. అందుకే అభిమానులు ఆమెకు ఎవరితోనో సంబంధాలు అంటగడతారు. ఈ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని నేను చెప్పగలను. మహిరా శర్మ తల్లి వారి కుటుంబ ప్రైవసీకి గౌరవం ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ వార్తలను సోషల్ మీడియాలో శాతం నమ్మకండి మరియు వ్యాపించవద్దని ఆమె సూచించారు.