Interstellar re-release: క్రిస్టోఫర్ నోలాన్ ఇంటర్స్టెల్లార్ రీ-రిలీజ్..సెన్సేషనల్ అడ్వాన్స్ సేల్స్!!
Interstellar re-release: ప్రపంచ సినిమా చరిత్రలో ఒక అద్భుతమైన కృషి, క్రిస్టోఫర్ నోలాన్ డైరెక్షన్లో వచ్చిన ‘ఇంటర్స్టెల్లార్’ సినిమా. 2025 ఫిబ్రవరి 7న గ్రాండ్ రీ-రిలీజ్ కోసం సిద్ధమవుతోంది. 2014లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ scince ఫిక్షన్ ఎపిక్, సినిమా ప్రేమికుల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇప్పుడు, ఈ film మరోసారి బిగ్ స్క్రీన్ మీద చూడాలనే అవకాశం ప్రేక్షకులకు రాబోతుంది.
Interstellar re-release date and details
ఇటీవలే వచ్చిన తాజా అప్డేట్స్ ప్రకారం, ఇంటర్స్టెల్లార్ మంచి అడ్వాన్స్ బుకింగ్స్ సాధించింది. 1 లక్ష పైగా టికెట్లు భారతదేశంలో విక్రయమయ్యాయి, ఇవి 5 కోట్ల రూపాయల అడ్వాన్స్ సేల్స్‌కు సమానం. ఈ అద్భుతమైన ప్రీ బుకింగ్స్ ఇప్పటివరకు తుంబడ్ (30-32 కోట్ల రూపాయల సేల్స్) మరియు యే జవానీ హై దీవానీ (26 కోట్ల రూపాయల సేల్స్) సినిమాలను దాటాయి. ఇది సినిమాకు మరింత ప్రేరణను ఇచ్చింది మరియు నోలాన్ యొక్క చిత్రమునకు తిరిగి ప్రేక్షకుల మధ్య మరింత క్రేజ్ వచ్చింది.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ఇంటర్స్టెల్లార్ సినిమా ఫిబ్రవరి 7 నుండి 13 వరకు థియేటర్లలో మాత్రమే ప్రదర్శించబడుతుందని ప్రకటించబడింది. అయితే, టికెట్ సేల్స్ చూస్తుంటే, సినిమా విడుదల వ్యవధిని పెంచే అవకాశం ఉన్నట్లు సూచనలు అందుతున్నాయి. ఈ చిత్రంలో మాథ్యూ మెక్కోనాహే, ఆన్ హాతవే, జెసికా చాస్టేన్, బిల్ ఇర్విన్, ఎలెన్ బర్స్టిన్, మైఖేల్ కేన్ ప్రధాన పాత్రల్లో నటించారు. హాన్స్ జిమ్మర్ స్వరపరచిన మ్యూజిక్ ఈ చిత్రానికి మరింత ఉత్కంట తెచ్చింది. ఈ అద్భుతాన్ని మళ్లీ థియేటర్లలో చూడాలని కోరుకునే వారు అస్సలు మిస్ కావద్దు!