SSMB29: మహేష్ – రాజమౌళి సినిమాలో పృద్వీరాజ్ సుకుమారన్ రోల్.. ఫుల్ క్లారిటీ ఇదే!!
SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం SSMB29 సినిమా కోసం ప్రేక్షకులు ఆత్రుత గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఒక హై-ఆక్టేన్, గ్లోబ్-ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందినట్లు సమాచారం, దీనితో అంచనాలు ఆకాశాన్నే తాకుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ప్రతి కొత్త అప్డేట్ కూడా అభిమానులను ఉత్సాహపర్చేస్తోంది.
Prithviraj Response on SSMB29 Role
ఇటీవల, మలయాళ స్టార్ పృద్వీ రాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో నటించనున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై పృద్వీ రాజ్ ను ప్రశ్నించగా, ఆయన తనదైన శైలిలో చమత్కారంగా సమాధానమిచ్చారు. “నేను ఈ సినిమా నటించడం పై ఇంకా చర్చలు జరుగుతున్నాయి, కనుక అన్ని ఖరారయ్యాక చెప్తాను” అని చెప్పారు.
ఈ సమాధానం పుకార్లకు మరింత ఊతమిచ్చింది. చిత్ర నిర్మాతలు ఎలాంటి అధికారిక ధృవీకరణ ఇవ్వకపోయినా, ఈ అంశంపై చర్చలు ఇంకా జరుగుతున్నాయి. పృద్వీరాజ్ SSMB29లో ఏ పాత్రలో కనిపిస్తారో అనే దానిపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పృద్వీరాజ్ ప్రస్తుతం తన దర్శకత్వంలో రూపొందుతున్న L2: Empuraan చిత్రంలో కూడా బిజీగా ఉన్నారు. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం మలయాళ చిత్ర పరిశ్రమలో కొత్త ఊపు తీసుకువస్తుందని భావిస్తున్నారు.
SSMB29 గురించి మరిన్ని అప్డేట్లు విడుదలయ్యాక అభిమానులు మరింత ఉత్సాహంతో సినిమాను చూస్తారు. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి, మరియు ఈ చిత్రం భారతీయ సినిమాకి ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఆశిస్తున్నారు.