Gummanur Jayaram: తప్పుడు వార్తలు రాస్తే.. రైలు పట్టాల కింద వేసి తొక్కిస్తా?
Gummanur Jayaram: తనపై తప్పుడు వార్తలు రాస్తే జర్నలిస్టులను రైలు పట్టాల పైన వేసి తొక్కించి చంపేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు టిడిపి పార్టీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. అయితే.. తాజాగా గుమ్మనూరు జయరాం చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తనపై ఈ మధ్యకాలంలో తప్పు వార్తలు విపరీతంగా రాస్తున్న క్రమంలో… అనుచరులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు గుమ్మనూరు జయరాం.
Gummanur Jayaram Comments On Journalists
ఈ సందర్భంగా టిడిపి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ… తనకు వ్యతిరేకంగా ఎవరు వార్తలు రాసిన… రైలు పట్టాల పైన పడుకోబెట్టి చంపేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనపై వార్తలు రాస్తే రుజువులు కచ్చితంగా ఉండాలని హెచ్చరించారు. రుధువు లేని వార్తలు రాస్తే పట్టాలపై పడుకోబెట్టి చంపడం గ్యారంటీ అన్నారు.
తాను ఎప్పుడు జనాలకు మంచి చేశాను తప్ప ఎప్పుడూ చెడు చేయలేదని వెల్లడించారు. కానీ కావాలని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇకపై ఇలాంటి వార్తలు పట్ల… సైలెంట్ గా ఉండబోనని… తేల్చి చెప్పారు గుమ్మనూరు జయరాం. ఒక్కొక్కరి అంతు తేల్చుతానని కూడా హెచ్చరించారు.