Tandel Movie: సముద్రంలో ఆ సీన్ కి 18 కోట్లు.. తండేల్ మూవీ గురించి షాకింగ్ సీక్రెట్ చెప్పిన డైరెక్టర్.?

Tandel Movie: తాత పెద్ద స్టార్.. తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం నిలబడింది అంటే దానికి ప్రధాన పిల్లరు అక్కినేని నాగేశ్వరరావు అని చెప్పవచ్చు. అలాంటి ఈయన నట వారసుడిగా ఇండస్ట్రీలోకి నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. తండ్రికి తగ్గ తనయుడిగా పెద్ద స్టార్ అయ్యారు.. అలాంటి అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉపయోగించుకొని ఎంట్రీ ఇచ్చిన హీరోలలో నాగచైతన్య కూడా ఉన్నారు.

18 crores for that scene in Tandel Movie

18 crores for that scene in Tandel Movie

అలాంటి ఈయన ఇండస్ట్రీలో ఒక్క భారీ హిట్టు కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు.. దీనికోసమే ఎన్నో కసరత్తులు చేసి యాక్టింగ్ లో దూసుకుపోతున్నాడు. అలా పాన్ ఇండియా స్థాయిలో తల టాలెంట్ ఏంటో నిరూపించుకోవడానికి తండేల్ చిత్రంతో వస్తున్నాడు నాగచైతన్య. ఈ చిత్రాన్ని డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా శ్రీకాకుళం జిల్లాలోని మచ్చలేశం గ్రామంలో చోటుచేసుకున్న రియల్ సంఘటనలు ఆధారంగా రూపొందుతోంది. (Tandel Movie)

Also Read: Tandel Movie Runtime: “తండేల్” మూవీ రన్ టైమ్.. ఏమాత్రం తగ్గని చైతు!!

మత్స్యకారులు వేటకు వెళ్లి పాకిస్తాన్ బోర్డర్లో అక్కడి కోస్ట్ కార్డుకు దొరికి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించి ఎలా తిరిగి వస్తారు అనే దానిపై సినిమా ఉంటుందట. ఇక ఈ సినిమాలో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, ఎమోషనల్ సీన్స్ చాలా ఆకట్టుకుంటాయని అంటున్నారు. ఆ ఒక్క సీన్ కోసం దాదాపు 18 కోట్ల రూపాయల ఖర్చు చేశారట.. సముద్రంలోనే ఎక్కువ సినిమా ఉంటుంది

18 crores for that scene in Tandel Movie

కాబట్టి లైవ్ లొకేషన్ కనిపించడం కోసం 18 కోట్ల వరకు ఖర్చుపెట్టి సీన్స్ తెరకెక్కించారట. ఈ విధంగా బడ్జెట్ విషయంలో ఎక్కడా తగ్గకుండా చందు మోండేటి సినిమాలు అద్భుతంగా తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ అన్ని కలిసి వచ్చి సినిమా హిట్ అయితే మాత్రం నాగచైతన్య పాన్ ఇండియా స్థాయిలో స్టార్ గా ఎదుగుతారని చెప్పవచ్చు.(Tandel Movie)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *