Mahesh Babu: మహేష్ బాబు చీప్ పనులు..500 కు క్వశ్చన్ పేపర్ అమ్మి..?
Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో మహేష్ బాబు ఎంతటి స్టార్డం సంపాదించుకున్నారో మనందరికీ తెలుసు.. కానీ ఆయన ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం. కనీసం చీమకు కూడా హానిచేయని మంచి గుణం.. కేవలం సినిమా షూటింగ్స్ తన ఫ్యామిలీ తప్ప మరో విషయాలపై ఆయన దృష్టి పెట్టరు.. అలా ఇప్పటివరకు మహేష్ బాబుపై ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ అయితే ఎక్కడా వినిపించడం లేదు. ఆ విధంగా తన క్యారెక్టర్ ను కాపాడుకుంటూ సినిమాల్లో స్టార్ గా కొనసాగుతూ వస్తున్నారు మహేష్ బాబు.
Mahesh Babu cheap works Sold question paper for 500
అలాంటి ఈ స్టార్ తో స్టార్ దర్శకుడు రాజమౌళి ఒక సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఇక ఇదిలా ఉండగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది.. ఆయన డబ్బులకు క్వశ్చన్ పేపర్ లీక్ చేసి అమ్మేవారట. మరి అది ఎప్పుడు జరిగింది? ఆ వివరాలు ఏంటో చూద్దాం.. మహేష్ బాబు బాల్యమంతా చెన్నైలోనే గడిచింది.. ఆయన స్కూల్ చదువంత చెన్నైలోనే పూర్తి చేశారు.(Mahesh Babu)
Also Read: Chiranjeevi Next Movie: చిరు కోసం అనిరుధ్ రవిచందర్.. రక్త పాతం కావాల్రా మీకు???
అంతేకాదు చెన్నైలో మహేష్ బాబుకు తెలుగు హీరోలైనటువంటి సుమంత్ క్లాస్మేట్, అంతేకాకుండా ఒక స్టార్ డైరెక్టర్ కూడా మహేష్ బాబు క్లాస్ మెట్ అట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరయ్యా అంటే తమిళ స్టార్ డైరెక్టర్ విష్ణువర్ధన్.. అయితే వీరు చిన్నతనంలో మహేష్ బాబుతో ఎక్కువగా ఫ్రెండ్ షిప్ చేసేవారట. ఇదే క్రమంలో మహేష్ బాబు చేసిన ఒక తుంటరి పని గురించి తాజాగా విష్ణువర్ధన్ సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారు..
ఈ సందర్భంగా ఆయన నవ్వుతూ మాట్లాడుతూ.. మీరు స్కూల్లో ఉన్నప్పుడు ఒక ప్లేస్ దగ్గరికి వెళ్లి క్యూస్షన్ పేపర్లను తీసుకొని వాటిని ఇతర విద్యార్థులకు అమ్మేవాళ్లం. అప్పట్లోనే ఒక్కో పేపర్లు 500 రూపాయలకు మేము విక్రయించే వాళ్ళం. ఇందులో మహేష్ బాబు ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అయ్యేవాడు.. వచ్చిన డబ్బులను ఆయన దగ్గరే పెట్టుకునే వాడు. ఈ విధంగా పాఠశాలలో చదువుకున్న సమయంలో మహేష్ బాబు చేసిన చిలిపి పనిని, ఆయన బయట పెట్టడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.(Mahesh Babu)