Senior Heroines: అంధకారంలో సీనియర్ హీరోయిన్ల భవిష్యత్తు.. కెరీర్ డౌన్ ఫాల్!!
Senior Heroines: టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లుగా గుర్తింపు పొందిన సమంత, తమన్నా, కాజల్ అగర్వాల్, నయనతార తమ కెరీర్‌లో కీలక దశను ఎదుర్కొంటున్నారు. గత కొన్ని సంవత్సరాల్లో, వీరి సినిమాల సంఖ్య తగ్గిపోవడంతో అభిమానుల్లో వారి భవిష్యత్తు గురించి ఆసక్తి పెరిగింది. వ్యక్తిగత కారణాలు, ఆరోగ్య సమస్యలు, కొత్త అవకాశాలపై దృష్టి సారించడం వంటి కారణాలతో వీరు టాలీవుడ్‌కి కొంత దూరంగా ఉంటున్నారు.
Senior Heroines in Tollywood 2025 Update
సమంత ప్రస్తుతం ఎక్కువగా OTT ప్రాజెక్ట్స్‌కి ప్రాధాన్యత ఇస్తోంది. ఆమెకు మయోసిటిస్ అనే ఆరోగ్య సమస్య తలెత్తిన తర్వాత థియేట్రికల్ సినిమాల కంటే డిజిటల్ ప్రాజెక్ట్స్‌ను ఎంచుకోవడానికి మొగ్గుచూపుతోంది. మరోవైపు, తమన్నా గ్లామర్ రోల్స్‌తో పాటు ప్రత్యేక గీతాల్లో కనిపిస్తూ తన క్రేజ్‌ను కొనసాగిస్తోంది. అయితే, కాజల్ అగర్వాల్ ఇటీవల పెళ్లి, కుటుంబ జీవితం వల్ల సినిమాలకు కొంత విరామం తీసుకుంది.
నయనతార విషయానికి వస్తే, ఆమె తమిళ చిత్ర పరిశ్రమలో మరింత బిజీగా మారింది. Bollywood చిత్రాలతోనూ దూసుకుపోతున్న నయనతార, ప్రస్తుతం తెలుగు చిత్రాలకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇక తమన్నా, కాజల్ హీరోయిన్ లుగా నటించిన సినిమాలు సంవత్సరానికి ఒక్కటి కూడా రావట్లేదు. పూజ హెగ్డే కూడా పెద్దగా సినిమా అవకాశాలు అందుకోవడంలేదు. వీరితో పటు చాలామంది హీరోయిన్ లు పెద్దగా సినిమాలు చెయ్యట్లేదు.ఇక రకుల్ ప్రీత్ సంగతి సరే సరీ..
వీరికి తెలుగు సినిమా లేకపోవడం టాలీవుడ్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. సీనియర్ హీరోయిన్లు సినిమాల్లో తక్కువగా కనిపించడంతో, టాలీవుడ్ కొత్త హీరోయిన్ల వైపు మొగ్గు చూపుతోంది. అయితే, వీరి అనుభవం, స్టార్ వాల్యూ ఇంకా ప్రేక్షకాదరణ ఉంటే, మళ్లీ వీరి సత్తా తెలుగులో రుచి చూపించే అవకాశముంది.