Prabhas Surprises Immanvi: హీరోయిన్ కు ప్రభాస్ స్పెషల్ ఫుడ్.. సర్ప్రైజ్ అయిన ఇమాన్వీ!!
Prabhas Surprises Immanvi: ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ (Fauji Movie) చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయనతో కలిసి ఇమాన్వీ (Immanuelle) హీరోయిన్గా నటిస్తున్నారు. సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.
Prabhas Surprises Immanvi with Tasty Food
ప్రభాస్ తన ఆతిథ్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. షూటింగ్ సమయంలో తన ఇంట్లో వండించిన రుచికరమైన భోజనాన్ని టీమ్‌కి పంపిస్తుంటారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఆయన ఇచ్చే విందుకు ఫిదా కాగా, ఇప్పుడు ఇమాన్వీ కూడా ఈ జాబితాలో చేరారు.
ప్రస్తుతం ‘ఫౌజీ’ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో (Ramoji Film City) జరుగుతోంది. ఇటీవల ప్రభాస్ తన ఇంట్లో వండించిన ప్రత్యేక భోజనం ఇమాన్వీ కోసం పంపించారు. షూటింగ్ విరామంలో ఆమె ఆ భోజనాన్ని ఆస్వాదించారు. ఆ రుచి మరచిపోలేని అనుభూతిని ఇచ్చిందని చెప్పారు.
ఈ విషయాన్ని ఇమాన్వీ ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram Post) పంచుకున్నారు. ప్రభాస్ అందించిన ఆతిథ్యం, రుచికరమైన విందుకు కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులు కూడా ఈ విషయంపై పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ప్రభాస్ శ్రద్ధ, అతిథి ప్రేమపై ప్రశంసల వర్షం కురుస్తోంది.