Priyanka Chopra: “కూర్చుంటే లో దుస్తులు కనిపించాలి”.. ప్రియాంక చోప్రాకి డైరెక్టర్ టార్చర్.?

Priyanka Chopra: హాలీవుడ్ రేంజ్ లో ఎదిగిన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాని ఆ డైరెక్టర్ నిజంగానే టార్చర్ చేశారా? ఎందుకు ప్రియాంక చోప్రా తో అలా వల్గర్ గా మాట్లాడారు.. అనేది ఇప్పుడు చూద్దాం.. ఎంతోమంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా చేదు అనుభవాలను మూట కట్టుకుంటారు. అలాంటి హీరోయిన్లలో ప్రియాంక చోప్రా కూడా ఒకరట.అయితే ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే చాలా వల్గర్ బిహేవియర్ చేసే డైరెక్టర్ని చూసిందట.

Director Torcher to Priyanka Chopra

Director Torcher to Priyanka Chopra

ఆ డైరెక్టర్ తన స్టైలిస్ట్ కి ఫోన్ చేసి ఏమేం మాట్లాడిందో పూస గుచ్చినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పేసింది. మరి ఇంతకీ ఆ డైరెక్టర్ ప్రియాంక చోప్రా గురించి ఎంత నీచంగా మాట్లాడారో ఇప్పుడు చూద్దాం.. ఈ గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్ ఎంత గ్లామర్ గా ఉంటే అంత బాగా సినిమాను చూడడానికి ఎగబడతారు జనాలు. ఇక ప్రేక్షకుల నాడి పట్టేసిన డైరెక్టర్లు కూడా సినిమాలో అశ్లీలత చూపించడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలా ముద్దు సీన్లు,రొమాంటిక్ సీన్లు ఎన్నో చూపిస్తున్నారు.(Priyanka Chopra)

Also Read: Ameer Khan: బెంగళూర్ మహిళతో అమీర్ ఖాన్ సీక్రెట్ ఎఫైర్.. త్వరలోనే 3 పెళ్లి..?

ముఖ్యంగా హీరోయిన్లను పొట్టి పొట్టి బట్టల్లో చూపించడం వారి ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా ఎక్స్పోజింగ్ చేయించడం ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది.అయితే ఇప్పుడే కాదు ప్రియాంక చోప్రాకి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే ఈ అనుభవం ఎదురయిందట. ఒక డైరెక్టర్ ప్రియాంక చోప్రా స్టైలిస్ట్ కి ఫోన్ చేసి హిందీలో మాట్లాడుతూ ప్రియాంక చోప్రా ప్రైవేట్ పార్ట్స్ బయటికి ఎంత బాగా కనిపిస్తే అంత మంచిది.ఆమె చేత పొట్టి బట్టలే వేయించాలి. అలాగే ఆమె కూర్చుంటే ఆమె లోపల ఉన్న దుస్తులు బయటికి కనిపించాలి అలా అయితేనే బాగుంటుంది.

Director Torcher to Priyanka Chopra

అలాగే ఆమె లోపల వేసుకున్న దుస్తులు బయటికి కనిపించేలా ప్రైవేట్ పార్ట్స్ బయటికి కనిపించేలా ఉంటేనే తొందర ఫేమస్ అవుతుంది.అలా బట్టలు వేయించు అంటూ చాలా నీచంగా ప్రియాంక చోప్రా స్టైలిష్ తో డైరెక్టర్ మాట్లాడారట. అయితే ఈ మాటలన్నీ విన్న ప్రియాంక చోప్రా వెంటనే డైరెక్టర్ దగ్గరికి వెళ్లి నువ్వు వద్దు నీ సినిమా వద్దు అని మొహం మీదే చెప్పేసిందిట. అంతేకాదు ఆ డైరెక్టర్ ప్రియాంక చోప్రా గురించి అంత నీచంగా మాట్లాడేసరికి చాలా రోజులు డిప్రెషన్ లోకి కూడా వెళ్లిందట.(Priyanka Chopra)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *