Janhvi Kapoor Cine career

Janhvi Kapoor: ఎన్నో కలలు కనీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తే ఆదిలోనే జాన్వి కపూర్ కి కలిసి రాలేదు. దీంతో జాన్వీ కపూర్ పై సోషల్ మీడియాలో నెగటివ్ ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ వదిలేసి సౌత్ లో రాణించాలి అనుకునే ఈ ముద్దుగుమ్మకి నందమూరి ఎన్టీఆర్ దేవర మూవీ కలిసి వచ్చేలా కనిపించడం లేదు. అయితే జాన్వీ కపూర్ కూడా పప్పులో కాలేసింది.. కనీసం సినిమా ఉన్న మూడు గంటల్లో గంట కూడా కనిపించకుండా ఏదో నాలుగైదు సన్నివేశాలలో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది.

Janhvi Kapoor Cine career

బయట ఎంతగానో అందాలు ఆరబోసే ఈ ముద్దుగుమ్మ కేవలం పాటల్లో కొన్ని కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కనిపించింది. ఇక ఈ సినిమాలో జాన్వి కపూర్ అందాలు కూడా అంతగా అరబోయలేదని సినిమా చూసిన అభిమానులు రివ్యూలు ఇస్తున్నారు. అంతేకాదు భారీ అంచనాల మధ్య టాలీవుడ్ లోకి జాన్వీ కపూర్ ఎంట్రీ ఇస్తే వచ్చిన ఫేమ్ ఏమీ లేదు అని అంటున్నారు.. అంతేకాదు జాన్వీ కపూర్ పరిస్థితి కూడా ఆ హీరోయిన్లలాగే మారబోతుంది అని జోస్యం చెబుతున్నారు. (Janhvi Kapoor)

Also Read: Ram Charan Wishes NTR: రామ్ చరణ్ దేవర విషెష్ కొరటాల కు లేదా.. మంట ఇంకా చల్లారలేదా!!

మరి ఇంతకీ జాన్వీ కపూర్ పై ఇలా మాట్లాడడానికి కారణం ఏంటి అనుకుంటున్నారా..దేవర సినిమాలో జాన్వి కపూర్ కేవలం నాలుగైదు సన్నివేశాల్లోనే కనిపిస్తుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కి అంతగా స్క్రీన్ స్పేస్ లేదు. అసలు ఈ సినిమాని ఆమె ఎందుకు ఓకే చెప్పింది అని కూడా కొంతమంది అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇక మొదటి సినిమానే ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో చాలామంది జాన్వీ కపూర్ కి కూడా శ్రీలీల కృతి శెట్టి కి పట్టిన గతే పడుతుంది కావచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Janhvi Kapoor Cine career

ఏది ఏమైనప్పటికీ భారీ అంచనాల మధ్య విడుదలైన దేవర సినిమా చూసిన అభిమానులు ఎలాంటి రివ్యూలు ఇవ్వకుండా నిరాశతో థియేటర్ నుండి బయటకు రావడం చాలామందిని బాధపెడుతోంది. అయితే ఇప్పుడే సినిమాకి సంబంధించి పూర్తి రివ్యూ ఇవ్వలేం ఎందుకంటే ఇంకో రెండు మూడు రోజులు గడిస్తే కానీ మాట్లాడలేం. కొన్ని సినిమాలు నాలుగైదు రోజుల తర్వాత కూడా కలెక్షన్స్ పుంజుకుని బ్లాక్ బస్టర్ అయినవి ఉన్నాయి. మరి దేవర సినిమాలో అలా జరుగుతుందేమో చూడాలి.(Janhvi Kapoor)