Tandel Movie Surprise Cameo: ఆ బాలీవుడ్ స్టార్ ‘తండేల్’ లో ఉన్నారా? క్యామియోపై క్లారిటీ ఇదే!!
Tandel Movie Surprise Cameo: అక్కినేని నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్గా నటించిన తండేల్ సినిమా ప్రస్తుతం సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కింది. ట్రైలర్ నుంచే నాగ చైతన్య కొత్త లుక్, ఇంటెన్స్ యాక్టింగ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ప్రస్తుతానికి, ఈ చిత్ర యూనిట్ సాలిడ్ ప్రమోషన్స్ నిర్వహిస్తూ నార్త్ ఇండియా లో కూడా ప్రత్యేకంగా ప్రచారం చేపట్టింది.
Tandel Movie Surprise Cameo or Rumor
ఇదిలా ఉంటే, తండేల్ లో ఓ సర్ప్రైజ్ క్యామియో ఉందని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. హిందీ ఫిలిం ఇండస్ట్రీ లో కూడా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అందులోనూ, ఆ సర్ప్రైజ్ క్యామియో బాలీవుడ్ మెగాస్టార్ అమీర్ ఖాన్ అని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో నాగ చైతన్య, అమీర్ ఖాన్ కలిసి లాల్ సింగ్ చద్దా లో నటించిన నేపథ్యంలో ఈ ఊహాగానాలు ఎక్కువయ్యాయి.
అయితే, ఈ రూమర్లకు తండేల్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. సినిమాలో అమీర్ ఖాన్ పాత్ర ఏదీ లేదు అని స్పష్టం చేశారు. సినిమా మీద పాజిటివ్ బజ్ ఉందని, కానీ అవాస్తవమైన వార్తలను నమ్మొద్దని స్పష్టం చేశారు. ఇలా అయితే, తండేల్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రత్యేకంగా, నాగ చైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీ, విభిన్నమైన కథ సినిమాపై హైప్‌ను పెంచాయి. మరి, ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!