Ram Charan Film: ప్రయోగాలన్నీ చరణ్ మీదే ఎందుకు.. RC16 పై ఫైర్ అవుతున్న మెగా ఫ్యాన్స్!!

Ranbir Kapoor not part of Ram Charan RC16 Old Filmmaking Style Returns in Ram Charan Film

Ram Charan Film: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “గేమ్ చేంజర్” అనేక అంచనాల నడుమ విడుదలైనప్పటికీ, ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆశతో ఎదురుచూసిన ఈ చిత్రం వారి అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఇప్పుడు, అందరి దృష్టి రామ్ చరణ్ తదుపరి ప్రాజెక్టుపై ఉంది, ముఖ్యంగా దర్శకుడు బుచ్చిబాబు సానా తో చేస్తున్న భారీ సినిమా పై ఆసక్తి మరింత పెరిగింది.

Old Filmmaking Style Returns in Ram Charan Film

ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్‌లో 16వ సినిమా అవ్వబోతుంది. “రంగస్థలం”, “దేవర”, “రోబో” వంటి బిగ్ బడ్జెట్ చిత్రాలకు పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాలోని ఒక ముఖ్యమైన సన్నివేశాన్ని old film negative reels ద్వారా చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఇది ప్రస్తుతం సాధారణంగా వినిపించని పద్ధతి అయినప్పటికీ, దర్శకుడు దీనిని ప్రత్యేకంగా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.

కొన్ని దశాబ్దాల క్రితం, సినిమాలు Negative Reels ద్వారా చిత్రీకరించేవారు. డిజిటల్ టెక్నాలజీ రాగానే ఈ పద్ధతి పూర్తిగా మాయమైంది. కానీ ఇప్పుడు, బుచ్చిబాబు సానా పాత శైలిని మళ్లీ తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, మొత్తం సినిమాను ఈ పద్ధతిలో తీయడం కష్టం కనుక, కొన్ని కీలకమైన సన్నివేశాలను మాత్రమే ఇలా షూట్ చేస్తున్నట్టు సమాచారం. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

ఈ విధమైన పద్ధతిలో సినిమా చేయడం పై మెగా ఫ్యాన్స్ కొంత నిరాశగా న్నట్లు తెలుస్తుంది. గేమ్ చేంజర్ సినిమా ఆశించిన ఫలితం అందుకోకపోవడంతో వారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు అర్థమవుతుంది. రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రయోగాత్మక ప్రయత్నం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో, రామ్ చరణ్ అభిమానులకు ఎంత వరకు సంతృప్తిని అందిస్తుందో వేచిచూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *