Pawan Kalyan who sank the movie Devara

Devara: ఏంటి దేవర సినిమాని ముంచింది పవన్ కళ్యాణా..ఇదెక్కడి విచిత్రం అనుకుంటారు ఈ విషయం తెలిసిన చాలా మంది జనాలు. మరి ఇంతకీ దేవర సినిమా ఫ్లాప్ టాక్ రావడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి.. దేవర సినిమా ఫ్లాప్ టాక్ రావడానికి పవన్ కళ్యాణ్ ఎలా కారణమయ్యారు అనే సంగతి ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న విడుదలైన దేవర సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది.

Pawan Kalyan who sank the movie Devara

అయితే ఈ సినిమాని చూసిన జనాలు కొంతమంది బాగుందంటే మరి కొంతమంది పెదవి విరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ సినిమా గురించి ఇంకో రెండు మూడు రోజులు దాటితే గాని ఏమి చెప్పలేని పరిస్థితి ఉంది. అయితే దేవర సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైంది. అయితే ఈ సినిమాకి కొన్ని ప్రాంతాల్లో ఫ్లాప్ టాక్ వచ్చింది.ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన పనికి దేవర సినిమా నిండా మునిగిపోయింది అంటూ సోషల్ మీడియాలో జనాలు ట్వీట్లు చేస్తున్నారు. (Devara)

Also Read: Devara Twitter Response: నెగెటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న ‘దేవర’

అయితే అసలు విషయం ఏమిటంటే.. రీసెంట్గా తిరుమల లడ్డు వివాదంలో హీరో కార్తీ తప్పేమీ లేకున్నా కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించి సారీ చెప్పారు. అయితే ఈ విషయంలో తమిళ తంబీలు పవన్ పై ఫైర్ అయ్యారు.అసలు కార్తీ మాట్లాడింది ఏమీ లేదు. అందులో వివాహస్పదమైన మాటలు కూడా లేవు ఆయన నేను లడ్డు గురించి స్పందించను అన్నారు.దానికే మీరు ఏవేవో మాటలు మాట్లాడారు.

Pawan Kalyan who sank the movie Devara

కార్తీ చేసిన తప్పేంటి అంటూ ఓ వర్గం తమిళ అభిమానులు పవన్ పై ఫైర్ అయ్యారు. అయితే ఇదే నేపథ్యంలో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన దేవర సినిమాకి తమిళనాడులో ఎదురు దెబ్బ తాకింది. పవన్ కళ్యాణ్ చేసిన పని వల్లే దేవర కి తమిళనాడులో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయని సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్స్.(Devara)