Sai Pallavi Health : సాయి పల్లవి ఇక పై సినిమాలు చేయదా? అనారోగ్య సమస్యలతో ‘తండేల్’ హీరోయిన్!!

Sai Pallavi Health Issues Impacting Film

Sai Pallavi Health: హీరోయిన్ సాయిపల్లవి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ విషయం గురించి ప్రముఖ దర్శకుడు చందు మొండేటి వెల్లడించారు. “థండేల్” సినిమా లో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. చిత్రం చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కింది. బన్నీ వాసు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాకు అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం, నిజమైన సంఘటనల ఆధారంగా నిర్మించబడింది. ఫిబ్రవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Sai Pallavi Health Issues Impacting Film

“లవ్ స్టోరీ” తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. “థండేల్” ఒక కొత్త ప్రేమకథను ప్రేక్షకులకు అందించబోతుంది. అభిమానులు ఈ సినిమాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సాయిపల్లవి ఇటీవల జ్వరం, జలుబుతో బాధపడుతున్నారు. ఈ విషయాన్నీ దర్శకుడు వెల్లడించాడు.

ఆమె “తండేల్” సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇంకా మరింత అస్వస్థత కు గురయ్యారు. డాక్టర్లు ఆమెకు కనీసం రెండు రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ఈ కారణంగానే ఆమె ముంబైలో జరిగిన “తండేల్” ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని అయన అన్నారు.. సాయిపల్లవి ఆరోగ్యం కోల్పోవడం ఆమె అభిమానులకు దుఃఖకరమైన విషయం అయినప్పటికీ, ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. “తండేల్ల్” సినిమా విజయవంతం కావాలని అక్కినేని అభిమానులతో పాటు సాయి పల్లవి అభిమానులు కూడా బలంగా కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *