Brahmanandam: బ్రహ్మానందం హీరోయిన్లను టార్చర్ చేసేవారా.. షూటింగ్లోనే అలా చేస్తూ.?
Brahmanandam: సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల కళా ప్రపంచం.. అలాంటి సినీ ఇండస్ట్రీ వారిపై ఆధారపడి డైరెక్ట్ గా ఇన్ డైరెక్ట్ గా చాలామంది బ్రతుకుతూ ఉంటారు.. కొంతమంది సినీ ఇండస్ట్రీ వారిపై తరచూ బురద జల్లుతూ ఫేక్ వార్తలు క్రియేట్ చేస్తూ వారిపై వారి ఛానల్స్ కు సంబంధించి హైప్ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు.. అయితే ఇది హీరో హీరోయిన్లపై చేస్తే పెద్దగా పట్టించుకోరు కానీ, మనల్ని ఎప్పుడూ కడుపుబ్బా నవ్వించే ఆ పెద్దాయనపై చేస్తే ఎవరైనా సీరియస్ అవ్వాల్సిందే..
Brahmanandam used to torture the heroines
అయితే తాజాగా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే హాస్యబ్రహ్మ బ్రహ్మానందంపై కూడా కొంతమంది ఆకతాయిలు ఫేక్ వార్తలు క్రియేట్ చేస్తూ ఆయన క్యారెక్టర్ ను బ్యాడ్ చేస్తున్నారు. బ్రహ్మానందం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లతో మరోరకంగా బిహేవ్ చేస్తారని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో అబద్దం ఉందో తెలుసుకుందాం.. బ్రహ్మానందం ఈ మధ్యకాలంలో సినిమాల్లో పెద్దగా నటించడం లేదు కానీ ఒక టూ ఇయర్స్ బ్యాక్ వెళితే ప్రతి సినిమాలో ఆయనకు క్యారెక్టర్ ఉండేది.. (Brahmanandam)
Also Read: Heroine: ఆ శృంగార తార ల్యాండ్ ల్యాండ్ కబ్జాలు చేస్తుందా.?
ఆయన నటించినక్కర్లేదు కేవలం సినిమాల్లో కనిపిస్తే చాలు నవ్వులే నవ్వులు.. అలా హాస్యబ్రహ్మగా పేరు పొందిన బ్రహ్మానందం సినిమాలకు కాస్త దూరమయ్యారు. దీనికి కారణం ఆయనేనట.. బ్రహ్మానందం అంటే కేవలం కామెడీ ఫీస్ లాగే చూస్తారు..ఆయనను ఎప్పటిలాగే చూడాలని, ప్రస్తుతం ఆయనకు కామెడీ చేసే శక్తి తగ్గిపోయిందని, ఒకవేళ నేను చేసినా చూసి జనాలు బ్రహ్మానందంకు అప్పటిలాగా కామెడీ చేయడం రావట్లేదు అనే విమర్శ వస్తుందని ఆయన ముందుగానే సినిమాలు చేయడం మానేశారట. ఇక బ్రహ్మానందం సినిమాల్లో మంచి ఫామ్ లో ఉన్నప్పుడు షూటింగ్ సెట్స్ లో చాలా కామెడీ చేస్తారట..
ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలుగు అర్థం కాని హీరోయిన్లను తరచు ఆటపట్టిస్తారట. ఇందులో కొంతమంది హీరోయిన్లు ఆయన కామెడీని ఫన్నీగా తీసుకుంటే మరి కొంతమంది సీరియస్ అయిపోయి బ్రహ్మానందం పై విరుచుకుపడిన సందర్భాలు కూడా ఉన్నాయట.. అయినా బ్రహ్మానందం అవేవీ పట్టించుకోకుండా వారిపై సెటైర్లు వేస్తూ కామెడీ చేసేవారట. ఈ విధంగా ఆయన చేసిన కామెడీని కొంతమంది ఆకతాయిలు ఆయన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అమ్మాయిలను ఇబ్బందులకు గురిచేస్తారు అంటూ వార్తలు రాస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వార్త వైరల్ అవుతుంది.(Brahmanandam)