Balakrishna : బాలయ్య అన్‌స్టాపబుల్.. ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్న చంద్రబాబు స్పీచ్!!

Chandrababu Viral Comments on Balakrishna

Balakrishna: గత కొన్ని సంవత్సరాలుగా నందమూరి బాలకృష్ణ కు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. రాజకీయంగా సినిమాల పరంగా బాలకృష్ణ కు అన్నీ కలిసి వస్తున్నాయి. ఇటీవలే డాకు మహారాజ్ సినిమా తో హిట్ అందుకున్న బాలకృష్ణ పద్మ బూషణ్ అవార్డ్ ను కూడా అందుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో బాలయ్య సోదరి ఘనంగా గ్రాండ్ పార్టీ నిర్వహించారు. ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. బాలయ్య అభిమానులు ఈ వేడుకను ఆసక్తిగా వీక్షించారు.

Chandrababu Viral Comments on Balakrishna

ఈ వేడుకలో బాలయ్యపై ఏపీ ముఖ్యమంత్రి మరియు ఆయన బావగారైన నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మా కుటుంబంలో ఇంత పెద్ద స్థాయికి ఎవరూ రాలేదు. బాలయ్య నిజంగా unstoppable, energetic, and powerful person,” అంటూ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు.

ఈ వ్యాఖ్యల ద్వారా బాలయ్య, చంద్రబాబు మధ్య ఉన్న బంధం ఎంత బలమైనదో స్పష్టమవుతోంది. అభిమానులు వీరి స్నేహాన్ని మెచ్చుకుంటున్నారు. Balayya mass image గురించి మాట్లాడిన చంద్రబాబు మాటలు అభిమానుల్లో ఉత్సాహం నింపాయి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలయ్య అభిమానులు ఈ వీడియోలను షేర్ చేస్తూ తెగ చర్చించుకుంటున్నారు. బాలయ్య క్రేజ్ రోజు రోజుకూ పెరుగుతుందనడానికి ఇదే నిదర్శనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *