Pooja Hegde: “నీ మొహం ఆ హీరోలతో రొమాన్స్ చేయడానికి పనికి వస్తుందా”.. పూజ హెగ్డే పరువు తీసిన విలేకర్.?
Pooja Hegde: అసలు నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీవు ఆ సినిమాలో నటించడానికి అర్హురాలివా అంటూ ఈ ప్రశ్నలు చాలామంది స్టార్ హీరోయిన్లకు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎదురైనవే. అయితే ఈ హీరోయిన్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ అయ్యాక కూడా ఈమెకు ఓ ప్రెస్ మీట్ లో అలాంటి ప్రశ్నే ఎదురయింది.ఇక ఆ హీరోయిన్ ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది పూజ హెగ్డే.. అవును మీరు వినేది నిజమే. పూజ హెగ్డే కి ఒక షాకింగ్ ప్రశ్న ఎదురయింది. అసలు ఆ హీరోల సినిమాల్లో నటించడానికి నువ్వు అర్హురాలివా అన్నట్లుగా విలేకర్ ఆమెను అవమానించారు.
Pooja Hegde defamed journalist
ఇక అసలు విషయం ఏమిటంటే.. షాహిద్ కపూర్ తో పూజ హెగ్డే నటించిన దేవా మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది.ఈ సినిమా ప్రమోషన్స్ కోసం పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న ఈ జంట తాజాగా ఓ ప్రెస్ మీట్ లో కూడా పాల్గొంది.అయితే ఆ ప్రెస్ మీట్ లో సినిమాకి సంబంధించిన ప్రశ్నలతో పాటు పూజ హెగ్డే ని అవమానించారు సదరు విలేకర్. ఆ విలేకర్ పూజ హెగ్డే తో మాట్లాడుతూ.. మీకు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు వస్తున్నాయి కదా.. దాన్ని మీరు అదృష్టం అనుకుంటారా..అసలు మీరు హీరోలతో నటించడానికి అర్హురాలని మీరు అనుకుంటున్నారా.. ఇప్పటికే సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకున్నారు.(Pooja Hegde)
Also Read: Rashmika: రష్మిక ముందు బన్నీ అసహ్యంగా ఉంటాడు..?
దాని గురించి మీరు ఎలా స్పందిస్తారు అని అడిగాడు. ఇక ఈ ప్రశ్నకు పూజ హెగ్డే కాస్త అసహంగా ఫీల్ అయ్యి డెఫినెట్గా నేను ఆ సినిమాలకు అర్హురాలని అనుకుంటాను.నేను ఆ సినిమాలకు కరెక్ట్ ఛాయిస్ అనుకుంటేనే కదా డైరెక్టర్లు ఆ సినిమా కోసం నన్ను తీసుకుంటారు. అదృష్టం అనుకుంటే అది మీ ఇష్టం కానీ నాకు ఇచ్చిన పాత్ర కోసం నేను 100% ఇస్తాను అంటూ పూజ హెగ్డే ఆన్సర్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ అదే విలేకర్ స్టార్ హీరోల సినిమాలనే మీరు ఎంచుకుంటున్నారా.. మీరు ఆ హీరోల సినిమాలు అయితేనే చేస్తారా..అసలు మీరు సినిమాలు ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటూ మళ్ళీ అడగగా..
అసలు మీ సమస్య ఏంటో నాకు అర్థం అవ్వడం లేదు. నా నుండి మీరు ఎలాంటి ఆన్సర్ రావాలి అనుకుంటున్నారో తెలియడం లేదు అంటూ ఆ విలేకరిపై మండిపడింది పూజ హెగ్డే. అయితే టాపిక్ డైవర్ట్ అవ్వడంతో అక్కడే ఉన్న షాహిద్ కపూర్ స్పందించి కూల్ పూజ..ఆ విలేకర్ మీరు నటించిన స్టార్ హీరోలతో సినిమాల్లో నటించాలి అనుకుంటున్నారు కావచ్చు. అందుకే మిమ్మల్ని అడిగి తెలుసుకుంటున్నారు అంటూ గొడవ సద్దుమణిగేలా చేశారు. అలా సదరు విలేకర్ పూజ హెగ్డేని పరోక్షంగా నీ మొహం మఆ హీరోలతో సినిమాలు చేయడానికి పనికి వస్తుందా అని అడిగేసరికి పూజ హెగ్డే పరువు మొత్తం పోయింది.(Pooja Hegde)