Tandel Event: తండేల్ ఈవెంట్ కి అల్లు అర్జున్ రాకపోవడానికి కారణం పోలీసులేనా?
Tandel Event: అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘తండేల్’ సినిమా భారీ అంచనాల మధ్య రూపొందుతోంది. చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రీ-రిలోజ్ ఈవెంట్ (pre-release event) శనివారం జరగాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల ఆదివారం వాయిదా పడింది. చిత్రబృందం అధికారికంగా ప్రకటించిన ప్రకారం, ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ప్రకటించడంతో బన్నీ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూశారు.
Why Allu Arjun Skipped Tandel Event
అయితే, చివరి నిమిషంలో అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. దీనికి గల కారణాన్ని నిర్మాత అల్లు అరవింద్ వెల్లడించారు. “బన్నీ ఫారెన్ ట్రిప్ (foreign trip) నుంచి తిరిగి వచ్చిన తర్వాత గ్యాస్ట్రిటిస్ (gastritis) సమస్యతో బాధపడుతున్నాడు. అందుకే ఈవెంట్‌కి హాజరుకాలేకపోయాడు. ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి ఎవరూ అపార్థం చేసుకోకండి” అని అల్లు అరవింద్ తెలిపారు. మరో వైపు అల్లు అర్జున్ తొక్కిసలాట కేసులో ఉన్న A3 గా నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నరనే వార్త హల్చల్ అవుతుంది. అందులో ఏమాత్రం నిజం లేదని ఇప్పుడు స్పష్టమైంది.
‘తండేల్’ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి స్పందన పొందాయి. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ (combination)పై భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్, ఎమోషన్ (emotion) కలబోసిన కథతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది.
ఈ సినిమా విజయం సాధిస్తే, చందూ మొండేటి దర్శకత్వ పరంగా మరో మైలురాయిగా నిలవనుంది. ప్రేక్షకులు, అభిమానులు సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ (update) కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ‘తండేల్’ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.