Allu Arjun Next Movie: అల్లు అర్జున్ కొత్త సినిమా షూటింగ్ డేట్? 300 కోట్ల భారీ ప్రాజెక్ట్!!
Allu Arjun Next Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) మరోసారి భారీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో (Ala Vaikunthapurramuloo) వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన ఈ కాంబినేషన్, ఇప్పుడు నాలుగో సినిమాతో మరో సంచలనాన్ని సృష్టించేందుకు సిద్ధమవుతోంది.
Allu Arjun Next Movie Shooting Updates
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఈ నెలాఖరులో షూటింగ్ ప్రారంభించనుంది. ప్రస్తుతం బన్నీ తన కొత్త లుక్ (new look) కోసం త్రివిక్రమ్‌తో కలిసి వర్కౌట్స్ చేస్తున్నారు. పాత్రకు తగ్గట్టు స్టైల్ , మేకోవర్ ఫిక్స్ చేసినట్లు టాక్. ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ (Haarika & Hassine Creations) మరియు గీతా ఆర్ట్స్ (Geetha Arts) సంయుక్తంగా నిర్మించనున్నాయి. దాదాపు ₹300 కోట్లు బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించనున్నారు.
భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతుండటంతో, సినీ లవర్స్ఎ ప్పుడెప్పుడు అప్‌డేట్స్ వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంగీతాన్ని ఎస్.ఎస్. థమన్ (SS Thaman) అందించనుండటం మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత హిట్స్‌ను మించేలా ఈ సినిమా ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమా కథ, కథానాయకురాలు ఇతర నటీనటుల గురించి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ చిత్రం 2025లో గ్రాండ్ రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్నారు. మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ త్వరలో వెల్లడి కానున్నాయి. ఫ్యాన్స్ కోసం ఇది నిజంగా క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందని చెప్పొచ్చు!