Anukunnavanni Jaragavu Konni: అమెజాన్ ప్రైమ్‌ OTTలో దూసుకెళ్తున్న “అనుకున్నవన్నీ జరగవు కొన్ని”

Anukunnavanni Jaragavu Konni: శ్రీరాం నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటించిన “అనుకున్నవన్నీ జరగవు కొన్ని” (Anukunnavanni Jaragavu Konni) చిత్రం జనవరి 31 నుంచి అమెజాన్ ప్రైమ్‌ (Amazon Prime) లో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Anukunnavanni Jaragavu Konni Movie OTT Hit

ప్రముఖ నటులు పోసాని కృష్ణమురళి, భంచిక్ బబ్లూ, కిరీటి, మిర్చి హేమంత్, గౌతం రాజు కీలక పాత్రలు పోషించారు. జి. సందీప్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను శ్రీ భరత్ ఆర్ట్స్ (Sri Bharat Arts) పతాకంపై నిర్మించారు. గిడియన్ కట్టా సంగీతం అందించగా, అజయ్, చిన్నారావు సినిమాటోగ్రఫీ నిర్వహించారు.

ఈ చిత్రం థ్రిల్లింగ్ కథతో పాటు వినోదాన్ని సమపాళ్లలో అందిస్తూ, ప్రేక్షకు నుంచి మంచి స్పందన అందుకుంది. OTT లో అద్భుతమైన ఆదరణ పొందుతుండడంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ మిశ్రమంతో, కొత్త కథాంశంతో రాబోయే రోజులలో మరింత మంది ప్రేక్షకులను ఆకర్షించే అవకాశం ఉందని ఫిల్మ్ యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *