Butter Milk: భోజనం చేసే సమయంలో చాలామంది చివరిగా పెరుగు వేసుకొని తింటూ ఉంటారు. పెరుగు తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రతి ఒక్కరు దానిని తినడానికి ఇష్టపడతారు. అయితే పెరుగు తినడానికి బదులు రోజుకు ఒక గ్లాస్ మజ్జిగ తాగినట్లయితే అనేక రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని వైద్యనిపుణులు సూచనలు చేస్తున్నారు. రోజు ఒక గ్లాసెడు మజ్జిగ తాగినట్లయితే జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. అజీర్ణం, యాసిడ్ సమస్యలు దూరం అవుతాయి. డిహైడ్రేషన్ లాంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రతిరోజు ఇలా తాగినట్లయితే ఆరోగ్యంగా ఉంటారు. Butter Milk
Drinking a Glass Of Buttermilk During Summer Improves Digestion And Reduces Acidity
ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులోని గుణాలు శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. నిత్యం కండరాల సమస్యతో బాధపడేవారు మజ్జిగను తప్పకుండా ఆహారంలో ఒక భాగం చేసుకోవాలి. ఇది ఎముకల బలానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా తయారు చేసి మచ్చలు, మొటిమలు తొలగించేందుకు ఎంతో సహాయపడుతుంది. ముఖ్యంగా మజ్జిగ రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఇందులో ప్రోబయోటిక్స్ ఉండడంవల్ల రోగ నిరోధక శక్తి బలపడుతుంది. దీంతో జలుబు, దగ్గు వంటి సమస్యలు తొలగిపోతాయి. Butter Milk
Also Read: Vijayasa Reddy: టీడీపీలోకి విజయసాయిరెడ్డి ?
మజ్జిగను క్రమం తప్పకుండా తాగినట్లయితే కొలెస్ట్రాల్ సమస్యలు తగ్గుతాయి. ఇందులో ఉండే బయో యాక్టివ్ సమ్మేళనాలు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు పెరుగు లేదా మజ్జిగను వేసి ప్రతిరోజు ఒక పూట అన్నం తినిపించినట్లైతే వారి కడుపులో చల్లగా ఉంటుంది. దానివల్ల హాయిగా నిద్రపోతారు. తద్వారా సులభంగా బరువు పెరుగుతారు. చిన్నపిల్లలకు ఇలా తినిపించడం వల్ల చాలా మంచిది వారి ఎముకలు బలంగా తయారై పెరుగుదలలో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉంటారని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. Butter Milk