Roja: విడాకులపై షాకింగ్ కామెంట్లు చేసిన రోజా.. ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చిందేంటి.?
Roja: ఈ మధ్యకాలంలో చాలామంది పెళ్లికి కట్టిన మామిడి ఆకులు ఆరిపోకముందే విడాకులు తీసుకొని దూరమవుతున్నారు. ఇక ఈ తంతు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది.. కొన్నాళ్లపాటు ప్రేమించుకుని పెళ్లికి ముందు ఎంతో అన్యోన్యంగా జీవించిన ఈ జంటలు పెళ్లి తర్వాత అలా ఎందుకు జీవించడం లేదో చాలావరకు అర్థం కావడం లేదు.. పెళ్లి తర్వాత ప్రతిసారి గొడవలు పెట్టుకుని వారి జీవితాలను రోడ్డుమీదకి తెచ్చుకుంటున్నారు. కొంతమంది పెళ్లిళ్లు చేసుకుని పిల్లలు, పెళ్లి ఏజ్ కి వచ్చిన తర్వాత కూడా అభిప్రాయ బేధాలు వచ్చి విడిపోయి ఎవరి జీవితాన్ని వారు చూసుకుంటున్నారు..

Roja who made shocking comments on divorce
మరి ఈ విధంగా విదేశీ కల్చర్ మనదేశంలో కూడా ఎక్కువ అవ్వడంతో చాలామంది పెద్దలు ఆందోళన చెందుతున్నారు.. అలాంటి విడాకుల విషయంపై తాజాగా రోజా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది.. విడాకులకు కారణాలు ఏంటో కూడా చెప్పింది.. విడాకుల వ్యవహారం అనేది కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని రంగాల్లో ఉంది.. అయితే విడాకులకు ప్రధాన కారణం అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా ప్రతి రంగంలో ఎదుగుతున్నారు, డబ్బులు కూడా సంపాదిస్తున్నారు.. ( Roja)
Also Read: Sree Leela: పూజ హెగ్డే దారిలోనే శ్రీ లీల.. ఇలా అయితే ఖేల్ ఖతం.. దుకాన్ బంద్!!
దీనివల్ల భర్త భార్య కంటే ఎక్కువ అనే అహం భార్యలపై చూపించినప్పుడు, కొంతమంది మహిళలు అది తట్టుకోలేక నేను నీకంటే ఎక్కడ తక్కువ అనే భావనలోకి వెళ్లి గొడవలు పెట్టుకుంటున్నారు. ఈ విధమైన గొడవల వల్లే విడాకుల వరకు వెళ్తున్నారు.. ఇలా ఒకరి కంటే ఒకరు ఎక్కువ అనే భావన ఉండడం వల్లే ఈ విడాకుల వ్యవహారాలు ఎక్కువ పోతున్నాయి. కానీ ఒక్క నిమిషం ఆలోచించి అసలు విడాకులు ఎందుకు తీసుకుంటున్నాం. మన విడాకుల వల్ల ఎంతమంది సఫర్ అవుతారు అనేది ఆలోచిస్తే విడిపోవాలనే ఆలోచన దంపతులకు రాదు..

కానీ అవి ఏవి ఆలోచించకుండా ఇద్దరి మధ్య ఏమాత్రం చిన్న గొడవ వచ్చిన డైవర్స్ తీసుకొని మళ్లీ ఇంకో పెళ్లి చేసుకుంటున్నారు.. ఇలాంటి గుణం ఉన్న వ్యక్తులు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్న వారి పరిస్థితి మారదని రోజా తెలియజేసింది.. అంతేకాదు ఆమె తమిళ దర్శకుడు నిర్మాత సెల్వమని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు.. ప్రస్తుతం రోజా సెల్వమని ఎక్కువ స్థాయికి ఎదిగింది.. అయినా ఏనాడు కూడా సెలవమనిని సెల్వమని తక్కువ చేసి చూడలేదట.. అండర్స్టాండింగ్ తో ఉంటున్నాం కాబట్టి మేము కలిసి ఉన్నామని చెప్పుకొచ్చింది..( Roja)