Savitri: ఆ ఒక్క తప్పు సావిత్రి రహస్య బంధాన్ని బయటపెట్టిందా..?
Savitri: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. హీరోలతో సమానంగా పారితోషకం కూడా ఇవ్వరు.. కానీ హీరోలతో సమానంగా పోటీపడి నటించడమే కాకుండా పారితోషకం అందుకున్న హీరోయిన్ సావిత్రి.. అప్పట్లో ఈమె క్రేజ్ ఎన్టీఆర్, ఏఎన్నార్ కంటే ఎక్కువగా ఉండేది. ఆ హీరోలే ఈమె డేట్స్ కోసం ఎదురుచూసేవారు..

Did that one mistake expose Savitri secret bond
అలాంటి సావిత్రి ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తాను ఎంత సంపాదించిందో అంతకంటే ఎక్కువ దానధర్మాలు చేసి చివరికి తాను చనిపోయే సమయానికి చేతిలో చిల్లిగవ్వ లేకుండా అనాధల మరణించింది.. అయితే సావిత్రి కెరియర్ మంచి ఫిక్స్ లో ఉండగానే అప్పటికే వివాహమైనటువంటి జెమినీ గణేషన్ ను పెళ్లి చేసుకుంది.. (Savitri)
Also Read: K.P. Chowdary: ఆత్మహత్య చేసుకున్న టాలీవుడ్ నిర్మాత కి సురేఖ వాణి కూతురికి మధ్య సంబంధం.?
అయితే వీరి పెళ్లి విషయాలు కొన్ని సంవత్సరాల పాటు బయటకు తెలియకుండా మైంటైన్ చేశారు.. కానీ సావిత్రి ఒకానొక సమయంలో ఆ సీక్రెట్ ను బయట పెట్టింది.. సావిత్రి, జెమినీ గణేషన్ మధ్య ఏదో నడుస్తుందని అప్పట్లో చిన్నచిన్నగా వార్తలు వచ్చాయి. కానీ ఎవరు క్లారిటీగా చెప్పలేదు.. చివరికి సావిత్రి లక్స్ యాడ్ కోసం ఒప్పంద పత్రంలో సైన్ పెట్టిందట..

ఈ సమయంలో పొరపాటున సావిత్రి జెమినీ గణేషన్ అంటూ సంతకం పెట్టిందట.. వెంటనే ఆ పత్రాన్ని చూసినటువంటి లక్స్ యాజమాన్యం షాక్ అయిపోయిందట.. జెమినీ గణేషన్ తో ఈమెకు రిలేషన్ ఉందని యాడ్ ద్వారా బయట సమాజానికి తెలిసింది.. అలా అనుకోకుండా ఆమె చేసిన సంతకం వల్ల వారి మధ్య ఉన్నటువంటి రహస్య బంధం బయటపడింది.(Savitri)