Oats: రోజూ ఆహారంలో ఓట్స్ తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త ?
Oats: ఓట్స్ నేటి కాలంలో చాలా మంది తరచుగా తింటున్నారు. అయితే అవి వేటి నుంచి తయారు అవుతాయి అనే విషయం చాలామందికి తెలియదు. ఇవి ఎవేనా సేటివా అనే మొక్క విత్తనాల నుంచి వస్తాయి. ఈ మొక్కలు చూడడానికి బార్లీ, గోధుమ రూపంలో ఉంటాయి. ఓట్స్ లో కాపర్, ఐరన్, ఫోలేట్, జింక్, మెగ్నీషియం, మాంగనీస్, బాస్వరం, పొటాషియం, కాల్షియం, విటమిన్లు, బి3, బి5, బి1, బి6 బంటీ పోషకాలు ఉన్నందువల్ల ఇది మంచి పౌష్టిక ఆహారం.

health benfits With Oats
ఓట్స్ తినడం వల్ల రక్త సరాఫరా సాఫీగా జరుగుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్యలు తొలగిపోతాయి. డయాబెటిస్ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఊబకాయం రాదు. చర్మం మీద మంట, దురద వంటి ఇబ్బందులు సైతం తొలగిపోతాయి. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. పిల్లలకు క్రమం తప్పకుండా ఓట్స్ పెట్టినట్లయితే బాల్యంలో ఎదురయ్యే అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే ఓట్స్ తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం వీటిని అస్సలు తినకూడదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరేచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఓట్స్ తినకుండా ఉండాలి. అయితే అలాగే అలర్జీలతో బాధపడేవారు ఓట్స్ అస్సలు తినకూడదు. చర్మంపై దురద సమస్యలు వంటి అలర్జీలతో బాధపడే వారు కూడా ఓట్స్ తినకుండా ఉండాలి. ఇందులో భాస్వరం అధికంగా ఉండడం వల్ల మూత్రపిండాలపైన ప్రభావం చూపుతుంది. అందుకే కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఓట్స్ తినకూడదు. డయాబెటిస్ తో బాధపడుతున్న వారు వైద్యుని సూచనల మేరకు మాత్రమే ఓట్స్ తినడం మంచిది.