Egg: గుడ్డు ప్రతి రోజు తింటే 100 రోగాలకు చెక్ ?
Egg: గుడ్డు సంపూర్ణ పోషక ఆహారం అనే సంగతి అందరికీ తెలుసు. గుడ్డులో ప్రోటీన్ తో పాటు విటమిన్లు, ఖనిజాలు ఎన్నో ఉంటాయి. గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇతర అల్పాహారాల్లో లభించని పోషకాలు కోడిగుడ్డులో ఉంటాయి. శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు ఇందులో అధికంగా ఉంటాయి. పిల్లలకు అందించే ఆహారంలో కోడిగుడ్డు తప్పనిసరిగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

Health Benefits With eggs
దీనిలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కంటి సంబంధిత సమస్యలు రాకుండా కాపాడడంతో పాటు రేచీకటి నుంచి విముక్తిని కలిగిస్తాయి. తక్కువ క్యాలరీలు ఎక్కువ ప్రోటీన్లు, ఖనిజాలు ఉండే కోడిగుడ్డు కండరాలు, ఎముకలు దృఢంగా తయారు అవ్వడానికి తోడ్పడతాయి. ఎత్తు పెరగడానికి సహాయపడతాయి. రోజుకు ఒక ఆపిల్ తింటే డాక్టర్ వద్దకి వెళ్లాల్సిన అవసరం కూడా లేదని చెబుతున్నారు. అందుకు ప్రతిరోజు గుడ్డు తినడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
ఒక వ్యక్తి ప్రతిరోజు గుడ్డు తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. జీవక్రియలు సక్రమంగా సాగుతాయి. ఆరోగ్యంగా ఉండడానికి గుడ్డులో ప్రోటీన్లు తోడ్పడతాయి. గుడ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఎముకలకు బలాన్ని ఇస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రోజు గుడ్డు తినడం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం లేదా రాత్రి సమయంలో గుడ్డు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. గుడ్డులో ఉండే ప్రోటీన్లు, పోషకాలు జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. అంతేకాకుండా చర్మానికి తేమను అందించి వృద్ధాప్యం నుంచి కాపాడుతాయి. గుడ్లలో ఒమేగా-3, కొలిన్ అధికంగా ఉంటుంది. ఇది మెదడుకు, కళ్ళకు గుండెకు మేలు చేస్తాయి.