Green Chilies: పచ్చిమిర్చిని ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో వాడుతూ ఉంటాం. ఇది రుచిని పెంచడంతోపాటు శరీరానికి కావాల్సిన కొన్ని పోషకాలను అందిస్తాయని పోషకహార నిపుణులు చెబుతున్నారు. అయితే పచ్చిమిర్చిని కట్ చేసే విషయంలో చాలామంది మహిళలు విసుగు చెందుతారు. ఎందుకంటే ఇవి కట్ చేసేటప్పుడు చేతులు మంట ఎక్కుతాయి. పచ్చిమిర్చిని కట్ చేసే సమయంలో కటింగ్ బోర్డును ఉపయోగించడం వల్ల చేతులు మంట పుట్టవు. అయితే పచ్చిమిర్చి ఘాటు మాత్రమే కాకుండా రుచి కూడా బాగుంటుంది. Green Chilies
Health benefits of green chillies
ఇందులో విటమిన్ సి ఉండడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. పచ్చిమిర్చి తినడం వల్ల కళ్ళు, శరీరం, చర్మానికి కావాల్సినన్ని పోషకాలు సమృద్ధిగా అందుతాయి. పచ్చిమిర్చిని చల్లని లేదా చీకటి ప్రదేశంలో భద్రపరచాలి. గాలి తగిలే ప్రదేశంలో, వెలుతురు పడే ప్రదేశంలో పచ్చిమిర్చిని ఉంచినట్లయితే అందులోని విటమిన్లు తొలగిపోతాయి. అందుకే వీటిని చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. అయితే పచ్చిమిర్చిని అనారోగ్య సమస్యలు ఉన్నవారు తీసుకోకపోవడమే మంచిది. Green Chilies
Also Read: Chandrababu: చంద్రబాబు కొలికపూడి శ్రీనివాస్ తిరుగుబాటు ?
గుండె జబ్బులు ఉన్నవారు పచ్చిమిర్చిని తినకూడదు. అలాంటి వారు తిన్నట్లయితే గుండెలో మంట ఏర్పడే ప్రమాదాలు ఉంటాయి. బిపి పేషెంట్లు కూడా పచ్చిమిర్చిని తినకూడదు. ఇందులో ఉండే ఘాటు వల్ల బిపి ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా పచ్చిమిర్చి తినిపించకపోవడం మంచిది. ఎందుకంటే ఇందులో కారం ఎక్కువగా ఉండటం వల్ల వారి నోటికి మంట పుడుతుంది. అనంతరం కడుపులో మంట ఏర్పడే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. చిన్నపిల్లలకు పచ్చిమిర్చితో ఏదైనా వంట చేసినప్పుడు ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని మాత్రమే వేసి వంట చేయాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. Green Chilies