Roshan Kanakala: లక్కీ ఛాన్స్ కొట్టేసిన సుమ కొడుకు.. ఆ పొలిటిషన్ ఇంటికి అల్లుడిగా.?
Roshan Kanakala: తెలుగు ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో హీరోయిన్ కి ఎంతటి పాపులారిటీ ఉంటుందో యాంకర్ సుమకి అంత పాపులారిటీ ఉంది.. ఇండస్ట్రీలో ఎంతో మంది యాంకర్లు ఉన్నారు కానీ సుమ యాంకరింగ్ చాలా డిఫరెంట్.. ఆమె మైక్ పట్టి స్టేజ్ ఎక్కిందంటే గలగల మాట్లాడేస్తూ అందరినీ నవ్విస్తూ, సమయానికి తగ్గట్టు పంచులు విసురుతూ ఉంటుంది.. ఎంతటి బడా హీరో ప్రోగ్రాం అయినా సరే సుమ తప్పనిసరిగా హ్యాండిల్ చేస్తుంది.

Suma son Roshan Kanakala who got a lucky chance
అలా ప్రతిరోజు ఆడియో ఫంక్షన్లు పలు రియాలిటీ షోలు ఇలా ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా గడుపుతుంది.. అలాంటి సుమ తాజాగా జయమ్మ పంచాయతీ అనే చిత్రం ద్వారా మన ముందుకు వచ్చింది. ఈ విధంగా ఇండస్ట్రీలో యాంకరింగ్ లోనే కాకుండా, నటిగా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సుమ కనకాల ఇంటికి ఒక బడా రాజకీయ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి కోడలిగా రాబోతుందట. వివరాలు ఏంటో చూద్దామా.. (Roshan Kanakala)
ఇప్పటివరకు సుమా ఫ్యామిలీ నుంచి రాజీవ్ కనకాల సుమా గురించి మాత్రమే మనం వార్తలు విన్నాం. కానీ ఈసారి తన కొడుకు రోషన్ వల్ల సుమ ఫ్యామిలీ గురించి కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. అయితే రోషన్ ఒక బడా రాజకీయ ఫ్యామిలీకి చెందినటువంటి ఒక అమ్మాయిని ప్రేమించాడని, ఆ అమ్మాయి కూడా ఈయనతో పీకల్లోతు ప్రేమలో ఉందని చేసుకుంటే రోషన్ నే చేసుకుంటానని అంటుందట. దీంతో రెండు ఫ్యామిలీలు వీళ్లకు పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారని సోషల్ మీడియా సర్కిల్స్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

మరి ఇందులో ఎంతవరకు నిజముందో, అబద్ధం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం విపరీతంగా నెట్టింటా చక్కర్లు కొడుతోంది.. ఇదే తరుణంలో రోషన్ బబుల్ గం అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత ఇంకా ఏ సినిమా కూడా ప్రకటించలేదు కానీ ఆయన పెళ్లి గురించి వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.(Roshan Kanakala)