Health: ప్రతి ఒక్కరికి ఏదో ఒక అలవాటు ఉంటుంది కొంతమంది ఖాళీగా ఉన్న సమయంలో గోర్లు కొరుకుతూ ఉంటారు అయితే గోర్లు కొరకడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొంతమంది ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు భయానికి గురైన సమయంలో తెలిసి తెలియక అలవాటుగా గోర్లు కొరుకుతూ ఉంటారు ఎప్పుడో ఒకసారి ఇలా చేస్తే ఏమీ జరగదు కానీ అదే పనిగా ప్రతిసారి ఇలా చేయడం వల్ల అనారోగ్యం సంభవిస్తుందని నిపుణులు చెబుతున్నారు దీనిని అనికోఫేజి లేదా అనికోఫేజియా అని పిలుస్తారు. Health
Biting your fingernails But like cancer
ఈ అలవాటు ఉన్నవారు దానిని బదులుకోవడం చాలా కష్టం ఇలా గోర్లు కొరికే అలవాటు సాధారణంగా చిన్నతనంలోనే అంటే మూడేళ్ల వయసులోనే ప్రారంభమవుతుంది సుమారు చిన్న పిల్లల్లో 40% మంది అదేపనిగా గోర్లను కొరుకుతూ ఉంటారు. ఇలా గోర్లు కొరకడం వల్ల పెద్దపేగు క్యాన్సర్ వస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. గోడలో అనేక రకాల బ్యాక్టీరియా ఉంటుంది ఇలా గోర్లు కొరికినట్లైతే ఆ బాక్టీరియా కడుపులోకి ప్రవేశించి కడుపు లో అనేక రకాల సమస్యలు వస్తాయి. ఇది ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపిస్తోంది. అంతేకాకుండా గోర్లలోని మురికి నోటిలోకి చేరి జలుబు దగ్గు ఇతర అంటు వ్యాధులు వస్తాయి. Health
Also Read: World Record: టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ టీం కి దక్కని ఘనత సాధించిన టీం ఇండియా!!
ముఖ్యంగా గోర్లను కొరకడం వల్ల గోర్ల చుట్టూ ఉన్న చర్మం పొడిబారిపోయి పొరలు పొరలుగా పైకి లేస్తుంది దీనివల్ల అనేక రకాల వ్యాధులు సంభవిస్తాయి. అందువల్ల వీలైనంతవరకు నోటికి వేళ్ళను దూరంగా ఉంచడం మంచిది. మన నోటిలో చెప్పలేనన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి లాలాజలం ద్వారా వేలి చివరన గోర్ల అడుగు భాగానికి చేరుకుంటాయి దానివల్ల బ్యాక్ సిరియా ఇన్ఫెక్షన్లు కలుగుతాయి ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా ఏర్పడతాయి. అందువల్ల గోర్లను కొరకకుండా ఉండడానికి ప్రయత్నించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా చిన్నపిల్లలకు చిన్నతనంలోనే ఇలాంటి అలవాటు ఉంటే మాన్పించాలని హెచ్చరికలు చేస్తున్నారు. Health