Telangana Secratarite: అది సెక్రటేరియటా..? బస్తీ మార్కెట్టా..? నకిలీ ఉద్యోగి హల్‌చల్.. !
Telangana Secratarite: తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత… పాలన మొత్తం అస్తవ్యస్తమైంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో నెలకొన్నాయి. ముఖ్యంగా తెలంగాణ సెక్రటేరియట్ లో రోజుకో సంఘటన జరుగుతోంది. తాజాగా.. తెలంగాణ సెక్రటేరియట్ లో నకిలీ ఉద్యోగులు హల్చల్ చేశారు. ఫేక్ ఐడి కార్డుతో లోపలికి ఎంట్రీ ఇచ్చి రచ్చ రచ్చ చేస్తున్నారు నకిలీ ఉద్యోగులు.

Fake employees create ruckus in Telangana Secretariat
ఇప్పటికే ఇలాంటి సంఘటన బయటపడగా తాజాగా…. మరికొంతమంది ఉద్యోగులు తెరపైకి వచ్చారు. తహసిల్దార్ పేరిట ఆ సచివాలయంలోకి కొంపల్లి అంజయ్య అనే వ్యక్తి ఎంట్రీ ఇచ్చి… అన్ని పనులు చేసుకుంటున్నాడు. తహసిల్దార్ స్టిక్కర్ ఉన్న వాహనంలో కొన్ని రోజులుగా సెక్రటేరియట్ లో చెక్కర్లు కొడుతున్నాడు ఈ మొనగాడు.
అయితే తాజాగా అతనిపై అనుమానం రావడంతో… పోలీసులకు సమాచారం ఇచ్చింది ఈ సెక్యూరిటీ సిబ్బంది. ఈ సందర్భంగా అతడు ఫేక్ ఉద్యోగి అని తేలిపోయింది. అతని ఐడి కార్డ్ గుర్తించి… వెంటనే అరెస్టు చేశారు పోలీసులు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.