Silk Smita: తండ్రితో ఎఫైర్.. కొడుకుతో ప్రేమ.. సిల్క్ స్మిత మరణానికి కారణం ఇదేనా.?
Silk Smita: ప్రస్తుతం చాలా ఇండస్ట్రీలలో ఎంతో మంది హీరోయిన్లు బోల్డ్ పాత్రల్లో నటించడానికి ముందుకు వస్తున్నారు.. కానీ ఒకప్పుడు బోల్డ్ పాత్రల్లో నటించాలంటే హీరోయిన్లు ముందుకు వచ్చేవారు కాదు.. అలాంటి సమయంలో బోల్డ్ బ్యూటీగా మంచి గుర్తింపు తెచ్చుకుంది మత్తు కళ్ళ సుందరి సిల్క్ స్మిత.. ఈమె సినిమాల్లో నటిస్తుంది అంటే మూలన ఉన్న ముసలి తాత నుంచి మొదలు 18 ఏళ్ల యువకుడి దాకా సినిమా థియేటర్లోకి పరుగులెత్తే వారు.. ఆ విధంగా శృంగార తారగా గుర్తింపు పొందిన సిల్క్ స్మిత డేట్స్ కోసం పెద్దపెద్ద దర్శకనిర్మాతలే వెయిట్ చేసేవారు..

Is this the reason for Silk Smita death
అలా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న సిల్క్ స్మిత కోట్లాది ఆస్తులను సంపాదించి తాను చివరి సమయంలో అనాధల చనిపోయింది.. ఆమె మరణానికి కారణం ఎవరు అనేది ఇప్పటికి ఒక మిస్టరీ అని చెప్పవచ్చు.. అలాంటి సిల్క్ స్మిత ఒక వ్యక్తితో రిలేషన్ లో ఉంటూనే ఆయన కొడుకుతో కూడా ప్రేమలో పడిందట.. ఈ విషయాన్ని తాజాగా సిల్క్ స్మిత తో సినిమాలు చేసిన నటి జయశీల ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది.. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. నేను సిల్క్ స్మిత ఇండస్ట్రీలోకి ఒకేసారి వచ్చాం..(Silk Smita)
Also Read: Samantha: శోభితపై అసూయ.. దాన్ని నేను పట్టించుకోనంటూ సమంత షాకింగ్ కామెంట్స్.?
ఆమె చాలా కష్టపడి ఇండస్ట్రీలో ఎదిగింది.. కొత్తగా వచ్చిన సమయంలో ఆమెను చాలా మంది ఛీత్కరించారు.. నీ కలర్ కు హీరోయిన్ అవుతావా అంటూ విమర్శించారు.. ఇవేవీ పట్టించుకోకుండా ఆమె ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ఎంతో కష్టపడి చివరికి స్టార్ గా మారింది.. అంతేకాదు పెద్ద పెద్ద స్టార్ల ముందు కూడా షూటింగ్ సెట్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చునే స్థాయికి చేరింది.. కెరియర్ మంచి పొజిషన్ లో ఉండగానే ఒక వ్యక్తితో ఆమె రిలేషన్ షిప్ పెట్టుకుంది..

ఆయన సిల్క్ స్మిత దగ్గర ఉన్న సొమ్మంతా దోచుకున్నారు.. ఇదే తరుణంలో సిల్క్ స్మిత అతని కొడుకుతోనే ప్రేమలో పడింది.. అంతే కాదు ఆయనను పెళ్లి చేసుకొని తల్లి కూడా కావాలనుకుందట.. కానీ ఈ విషయం ఆ వ్యక్తికి తెలిసి ఆయన సిల్క్ స్మిత ను టార్చర్ చేశారట.. సిల్క్ స్మిత మరణానికి ఇది కూడా కారణం ఆమె చెప్పుకోవచ్చు అంటూ మాట్లాడింది… ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.(Silk Smita)