Kriti Shetty: అవకాశాలు రాకపోవడంతో ఆ పని చేస్తున్న బేబమ్మ!!

Kriti Shetty: ఇటీవల నూతన హీరోయిన్లకు టాలీవుడ్‌లో అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. ఒక్క సినిమాతోనే స్టార్‌డమ్ తెచ్చుకుని, వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోతున్నారు. అలాంటి లక్కీ బ్యూటీ కృతి శెట్టి. “ఉప్పెన”తో ఒక్కసారిగా ఫేమస్ అయిన ఈ హీరోయిన్, తర్వాత వరుసగా సినిమాలు చేసినా బిగ్ హిట్ కొట్టలేకపోయింది. దాంతో అవకాశాలు తగ్గిపోతున్నాయి.
Kriti Shetty Bollywood Entry
టాలీవుడ్‌లో క్రేజ్ తగ్గిపోతుండటంతో కృతి శెట్టి మలయాళ సినిమాల్లో అడుగుపెట్టి అక్కడ హిట్ కొట్టింది. ఇప్పుడు హిందీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. బాలీవుడ్‌లో నటనకు మంచి అవకాశాలు రావొచ్చని ఆశిస్తున్నప్పటికీ, ఆమె చేసిన తాజా నిర్ణయం ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేసింది.
హీరోయిన్‌గా కాకుండా, కృతి తన బాలీవుడ్ డెబ్యూటీని ఓ స్పెషల్ సాంగ్‌తో చేయనున్నట్లు టాక్. టాప్ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ఒక్క ఐటెం సాంగ్ చేయడం వల్ల అక్కడ అవకాశాలు పెరుగుతాయని భావించినట్లు తెలుస్తోంది. అయితే, ఇదే సరైన నిర్ణయమా? లేక కెరీర్‌ను ఇబ్బందికరమైన దారిలో నడిపిస్తోందా? అనే చర్చ నడుస్తోంది.
ఫ్యాన్స్ మాత్రం “అవకాశాలు ఉన్నప్పుడు స్పెషల్ సాంగ్స్ ఎందుకు?” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌లో కృతి శెట్టి రాణించగలదా? లేదా ఈ ప్రయోగం ఆమె కెరీర్‌ను ప్రభావితం చేస్తుందా? అన్నది ఆసక్తిగా మారింది.