Ram Charan: రామ్ చరణ్ కొత్త సినిమా అప్‌డేట్..ఇంట్రెస్టింగ్ డీటైల్స్ వెల్లడి!!

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జోడిగా నటిస్తున్న సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చరణ్ కెరీర్‌లో 16వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా, ఎమోషన్, యాక్షన్, స్పోర్ట్స్ కలయికలో సాగే సాలిడ్ డ్రామాగా రూపొందుతోంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి స్వింగ్‌లో కొనసాగుతోంది.
Ram Charan Intense Cricket Role
ఇటీవల ఈ సినిమాపై పలు రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఇది స్పోర్ట్స్ డ్రామా, కాదు యాక్షన్ మూవీ అంటూ అనేక ఊహాగానాలు వచ్చాయి. అయితే, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఇచ్చిన తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందని తెలుస్తోంది. తన సోషల్ మీడియా ఖాతాలో ‘పవర్ క్రికెట్’ అని రాసిన ఓ లైన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనితో, రామ్ చరణ్ పాత్రలో ఒక స్ట్రాంగ్ క్రికెటర్ లుక్ కనిపించనుందని టాక్.
ఇక రామ్ చరణ్ రోల్ గురించి అయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఆయన బ్యాటింగ్ స్టైల్ మామూలుగా ఉండదట. క్రికెట్‌లో పవర్ హిట్టర్‌గా కనిపించనున్న చరణ్, బాల్ ను స్టేడియంని దాటి బహుదూరం కొట్టే సీన్ కూడా షూట్ చేశారట. ఈ సీన్ సినిమాకే హైలైట్ కానుందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.
ఈ క్రేజీ కాంబినేషన్‌ను బుచ్చిబాబు సానా ఎలా ట్రీట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం, రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.