Tollywood Heroines: టాలీవుడ్ బ్యూటీల వెకేషన్..హీరోయిన్ ల హాట్.. హాట్ ఫోటోలు వైరల్
Tollywood Heroines: టాలీవుడ్ అందాల భామలు తమ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మీనాక్షి చౌదరి, శ్రీలీల, కీర్తి సురేష్, త్రిష లాంటి టాప్ హీరోయిన్లు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, వెకేషన్‌ను మాత్రం మిస్ చేసుకోవడం లేదు. తమ పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి, మనసుకు తీపి గుర్తుగా కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలను ఎంచుకుని ఎంజాయ్ చేస్తున్నారు.
Tollywood Heroines Enjoying Vacation

మీనాక్షి చౌదరి ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నారు. ప్రస్తుతం ఆమె ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే, చిన్న విరామం తీసుకుని దుబాయ్ వెకేషన్‌కు వెళ్లి అక్కడ మజా మస్తీ చేస్తూ కొన్ని స్టన్నింగ్ ఫోటోలను షేర్ చేశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.

శ్రీలీల కూడా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. 2024లో కొంత బిజీ తగ్గించినా, 2025లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నారు. ఇక కీర్తి సురేష్, పెళ్లి తర్వాత ‘బేబీ జాన్’ ప్రమోషన్స్‌తో బిజీగా గడిపిన ఆమె, ఇప్పుడు తన భర్తతో కలిసి హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు.

త్రిష సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్‌ను కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె చిరంజీవితో ‘విశ్వంభర’, విజయ్, సూర్యలతో పెద్ద ప్రాజెక్టులలో నటిస్తున్నారు. అయినా, రిలీఫ్ కోసం థాయ్‌లాండ్ పటాయ బీచ్‌లో హాలిడేకి వెళ్లి అక్కడి అందాలను ఆస్వాదిస్తున్నారు. మొత్తానికి, మన స్టార్ హీరోయిన్లు వెకేషన్ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు.
