Tandel First Day: నాగ చైతన్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్.. అజిత్ సినిమాను క్రాస్ చేసి!!

Tandel First Day: ఈ ఫిబ్రవరిలో సినీ అభిమానులను అలరించబోయే లేటెస్ట్ మూవీస్‌లో, తమిళ స్టార్ అజిత్ నటించిన ‘విడా ముయర్చి’, అలాగే అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో వచ్చిన ‘తండేల్’ ఒకే రోజు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. అయితే, ప్రేక్షకుల స్పందన, టికెట్ బుకింగ్స్ పరంగా చూస్తే, నాగ చైతన్య నటించిన ‘తండేల్’ సినిమా అజిత్ మూవీని దాటేసింది.
Tandel First Day Box Office Record
‘తండేల్’ సినిమా శుక్రవారం ఒక్క రోజే 2 లక్షల 20 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. అజిత్ వంటి స్టార్ హీరో సినిమాకి ఊహించని విధంగా కేవలం 1 లక్ష 50 వేల టికెట్లు మాత్రమే బుక్ అయ్యాయి. ఇది నాగ చైతన్య కెరీర్‌లో ఓ క్రేజీ రికార్డ్‌గా నిలిచింది. సినీ విశ్లేషకులు ‘తండేల్‘కి ఎప్పటికీ నాగ చైతన్య హైయెస్ట్ ఓపెనింగ్స్ మూవీగా నిలిచే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
ఇక శనివారం టికెట్ బుకింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. చైతన్య కెరీర్‌లో హైయెస్ట్ నెంబర్స్ ఈ సినిమాతోనే నమోదయ్యాయి. బాక్సాఫీస్ వసూళ్ల పరంగా ‘తండేల్’ మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక ఫైనల్‌గా ‘తండేల్’ కలెక్షన్స్ ఎక్కడ ఆగుతాయో చూడాలి. ట్రేడ్ అనలిస్టులు ఈ సినిమా వరల్డ్‌వైడ్ గ్రాస్ రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.