KTR: తెలంగాణ రాష్ట్రంలో మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టుపై మరోసారి వివాదం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఈ ప్రాజెక్టును తీవ్రంగా విమర్శిస్తూ, రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ, “మూసీ నది మురికి అన్ని ప్రభుత్వ నేతల నోట్లోనే ఉంది” అని ఆరోపించారు.

KTR Questions Integrity of Musi Beautification Project

లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ ప్రాజెక్టు ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నించారు. “ఈ ప్రాజెక్టులో అవినీతి జరుగుతుందనే అనుమానం నిజం అవుతోంది” అంటూ, ప్రభుత్వంపై లీగల్ నోటీసులు పంపించామని వెల్లడించారు. ఆయన కూటమి రాజకీయాలపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు, ముఖ్యమంత్రి మరియు మంత్రులు మానసిక నిపుణుల వద్ద చికిత్స చేయాలని సూచించారు.

Also Read: Revanth Reddy: రేవంత్ సర్కార్‌ మరో గొప్ప పథకం..సామాన్యుల కోసం సరికొత్త దిశలో

ఈ ప్రాజెక్టు వల్ల ప్రజలు ఇళ్లు కోల్పోతున్నారని, కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గానద శ్రీకుమార్ అనే మేస్త్రీ తన ఇల్లు కూల్పబోతున్నందుకు గుండెపోటుతో మరణించిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం అందించే రూ.25,000 పరిహారం ప్రజలకు సరిపోందని, ప్రజలు జీవితాంతం కష్టపడి నిర్మించిన ఇళ్లను కోల్పోతున్నారని పలు సార్లు చెప్పారు.

అంతేకాక, ఈ ప్రాజెక్టు ద్వారా ప్రజలను ఆర్థికంగా నష్టపరుస్తుందని, వారి జీవితాలను అస్తవ్యస్తం చేస్తుందని ఆయన ఆరోపించారు. “ఈ ప్రాజెక్టు వెనుక నిజమై ఉద్దేశం ఏమిటి?” అని ప్రశ్నిస్తూ, ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో ప్రధాన చర్చగా మారింది.