VD12 Title Teaser: VD12 మూవీ టీజర్ కోసం పాన్ ఇండియా హీరోలు!!

VD12 Title Teaser: టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం రౌడీస్టార్ విజయ్ దేవరకొండ “VD12”. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ అప్‌డేట్‌ను మేకర్స్ నిన్న అధికారికంగా ప్రకటించారు. VD12 టైటిల్ టీజర్ ఫిబ్రవరి 12న విడుదల కానుంది, అని చిత్రయూనిట్ వెల్లడించింది. దీంతో, ఈ టీజర్ ఎలా ఉండబోతుందో? ఏ విధంగా సంచలనం సృష్టించబోతోందో? అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.
VD12 Title Teaser Latest News
అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న VD12 టైటిల్ టీజర్ కోసం పాన్-ఇండియా స్థాయిలో ప్రసిద్ధ హీరోలు వాయిస్ అందించనున్నట్లు సమాచారం. హిందీ వెర్షన్ కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌బీర్ కపూర్ వాయిస్ ఓవర్ అందించినట్లు తెలుస్తుంది. ఇక తెలుగు వెర్షన్‌కు “మ్యాన్ ఆఫ్ మాసెస్” వాయిస్ అందించనున్నాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విధంగా వివిధ భాషల్లో ప్రముఖ స్టార్స్ వాయిస్ అందించడం సినిమా పైన మరింత హైప్ క్రియేట్ చేసింది.
VD12లో విజయ్ దేవరకొండ అత్యంత పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని చిత్రయూనిట్ స్పష్టం చేసింది. ఆయన స్టైల్, యాటిట్యూడ్, యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్ కానున్నాయని టాక్. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణం వహిస్తున్నారు.
ఈ సినిమా టీజర్‌తో పాటు, విడుదల తేదీ, పాటలు, ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. VD12 సరికొత్త స్టైల్, ఇంటెన్స్ యాక్షన్‌తో విజయ్ దేవరకొండ కెరీర్‌లో మరో హిట్ అందించబోతుందా? అనే ఉత్కంఠ మరింత పెరిగింది.