Noni Fruit: నోని పండు చూడడానికి బంగాళదుంప ఆకారంలో, లేత ఆకుపచ్చ, పసుపు రంగులో ఉంటుంది. దీని లోపల చిన్న చిన్న గింజలు ఉంటాయి. ఈ పండులో విటమిన్ సి, ఫోలేట్, బయోటిన్, విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు, మొక్కల ఆధారిత ఫ్లేవనాయిడ్లు, ఆర్గానిక్ ఆసిడ్స్ విపరీతంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మంచిది. శరీరంలో ఏర్పడే హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తొలగించడానికి నూని పండు ముఖ్యపాత్ర పోషిస్తుంది. Noni Fruit

health benefits with Noni Fruit

శరీరంలోని కణాలను ఆక్సీకరణం మరియు దెబ్బతినకుండా చక్కగా పనిచేస్తాయి. నూని జ్యూస్ తాగితే శరీరానికి చాలా బలం చేకూరుతుంది. ఇవి శరీరానికి శక్తి స్థాయిలను పెంచుతాయి. కండర కణాలు అరిగిపోకుండా కాపాడుతాయి. నోని పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్లు శరీరానికి పనిచేస్తాయి. ఇవి శరీరంలోని వివిధ జీవ రసాయన ప్రతి చర్యలకు ఆహారాన్ని శక్తిగా మార్చడం ద్వారా సరైన జీవక్రియను సంరక్షించడానికి సహాయపడతాయి. నూని పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. Noni Fruit

Also Read: IND vs BAN: టీమిండియాలో గంభీర్ కొత్త రూల్స్…అందుకే బంగ్లా చిత్తు !

ముఖ్యంగా టెన్షన్, హైపర్ టెన్షన్ ను తగ్గించడానికి, రక్తపోటు కంట్రోల్ చేయడానికి ఈ పండ్లు సహాయపడుతుంది. శరీరంలోని రక్తనాళాలు, రక్తప్రసరణ ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా గుండె సమస్యలు ఉన్నవారు నూని పండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. డైట్ ఫాలో అయ్యేవారు, జిమ్ లో కసరత్తులు చేసేవారు నోని జ్యూస్ తప్పకుండా తాగినట్లయితే ఆరోగ్యానికి చాలా బలం చేకూరుతుందని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. Noni Fruit