Undavalli: వైసిపి పార్టీలోకి ఉండవల్లి అరుణ్ కుమార్?
Undavalli: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చక చక మారిపోతున్నాయి. మొన్నటి వరకు వైసిపి పార్టీ నుంచి బయటికి వెళ్లే నాయకులకు మనకు కనిపించారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా… మారిపోయింది. వైసిపి పార్టీ వీడిన వారిని పక్కకు పడితే… కాంగ్రెస్ లో కీలక నేతలు… జగన్ పార్టీలో చేరిపోతున్నారు.

Undavalli Arun Kumar joins YSRCP
కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఆగడాలను భరించలేకపోతున్న కొంతమంది కాంగ్రెస్ నేతలు బయటికి వస్తున్నారు. ఇప్పటికే శైలజనాథ్… జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో.. వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ మేరకు సంచలన ప్రకటన కూడా చేశారు. ఏపీలో కాంగ్రెస్ ఖాళీ అవుతుందని కూడా బాంబు పేల్చారు.
దీనికి తగ్గట్టుగానే రాజమండ్రి మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్…. వైసీపీ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఉండవల్లి అరుణ్ కుమార్. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్న నేపథ్యంలో… వైసిపి పార్టీని బలోపేతం చేసేందుకు రంగం సిద్ధం చేశారట ఉండవల్లి అరుణ్ కుమార్. ఫిబ్రవరి 25 లేదా 26వ తేదీలలో ఉండవల్లి అరుణ్ కుమార్… వైసిపి కండువా కప్పుకోబోతున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.